BigTV English

Rashmika Mandanna: మారువేషంలో ఆ థియేటర్ వెళ్లి కింగ్డమ్ సినిమా చూసిన రష్మిక

Rashmika Mandanna: మారువేషంలో ఆ థియేటర్ వెళ్లి కింగ్డమ్ సినిమా చూసిన రష్మిక

Rashmika Mandanna: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో రష్మిక మందన్న పేరు వినిపిస్తుంది. ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలోనే గుర్తింపు సాధించింది. అనిమల్ సినిమా ఎంత పేరుని తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


రష్మిక ఎంత మందితో సినిమాలు చేసిన విజయ్ తో సినిమా చేయడం అనేది ప్రత్యేకం. విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రేమలో ఉంది అని వార్తలు కూడా చాలాసార్లు వచ్చాయి. అంతేకాకుండా విదేశాల్లో వీరిద్దరూ వేరువేరుగా ఒకే చోట దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీనిని బట్టి వీరు కలిసే ఉంటున్నారు అని చాలా కథనాలు వినిపిస్తూ వచ్చాయి. ఇక విజయ్ సినిమా అంటే ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

మారువేషంలో ఆ థియేటర్ కు


మామూలుగా కామన్ ఆడియన్స్ తో పాటు సినిమా చూడాలని చాలామంది సెలబ్రిటీస్ కి ఉంటుంది. కానీ సెలబ్రిటీస్ థియేటర్ దగ్గరికి వస్తే వాళ్లకు వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం వచ్చినప్పుడు ఒక ఊహించని సంఘటన సంధ్యా థియేటర్ వద్ద జరిగింది. అందుకే థియేటర్ మేనేజ్మెంట్స్ సెలబ్రిటీలు థియేటర్ కు వస్తున్నాం అంటే నిరాకరిస్తారు. కింగ్డమ్ సినిమాను రష్మిక మందన్న శ్రీరాములు థియేటర్లో చూడాలని అనుకుంది. కానీ థియేటర్ మేనేజ్మెంట్ దానికి ఒప్పుకోలేదు. వెంటనే మారువేషంలో హైదరాబాద్ కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో ఆ సినిమా చూడటానికి రష్మిక వెళ్ళింది అని రీసెంట్ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.

రష్మిక కింగ్డమ్ రివ్యూ 

సినిమా చూసిన వెంటనే అభిప్రాయాన్ని చెప్పడం అనేది మామూలుగా జరుగుతుంది. అయితే సెలబ్రిటీలు అభిప్రాయాన్ని చెబితే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక రష్మిక కింగ్డమ్ సినిమా చూసిన వెంటనే ట్విట్టర్లో విజయ్ మనం కొట్టేసినం అంటూ పోస్ట్ పెట్టింది. అందరూ సినిమా గురించి చెప్పడం వేరు రష్మిక చెప్పడం వేరు. ఎందుకంటే రష్మిక మరియు విజయ్ దేవరకొండ మధ్య ఉన్న బాండింగ్ ఏంటో చాలా మందికి తెలిసిందే. మొత్తానికి ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఇప్పటివరకు రష్మిక మేనేజ్ చేయగలిగింది అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి చాలామంది వీడియోస్ వెతికే ప్రయత్నం కూడా చేస్తారు.

Also Read: Naga vamsi: ప్రపంచమంతా శాడిస్ట్ లే ఉన్నారు, మంచిగా ఉంటే ఎవడికి నచ్చదు

 

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×