Naga vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమా తీసిన ప్రొడ్యూసర్ పెద్దగా కనిపించేవారు కాదు. తన పేరు మాత్రమే వినిపించేది. ప్రొడ్యూసర్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా అరుదుగా జరిగేది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ప్రొడ్యూసర్ పేస్ కూడా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ అందరిలో కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపించే పేరు నాగ వంశీ. నాగ వంశీ మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలానే కొంతమందిని అసహనానికి కూడా గురిచేస్తుంది. కొన్నిసార్లు మీడియాతో నాగ వంశీ ఎంత ధైర్యంగా మాట్లాడుతారో మనం చాలా సందర్భాల్లో చూసాం.
ప్రపంచమంతా శాడిస్టు లే ఉన్నారు
కొన్నిసార్లు నాగ వంశీ చెప్పే మాటలు చాలా చర్చలకు దారి తీస్తాయి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం మాగ వంశీకి అలవాటు. కొన్నిసార్లు ఆ అలవాటే శాపంగా మారుతుంది. ఇక రీసెంట్ గా నాగవంశీ నిర్మించిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ కు విపరీతమైన పేరు వచ్చింది. ఇదే విషయాన్ని ఒక జర్నలిస్ట్ గుర్తుచేస్తూ విలన్ కి మంచి పేరు వచ్చింది అని చెప్పారు. దానికి వెంటనే విలన్ క్యారెక్టర్ కు అంత పేరు ఎందుకు వచ్చింది అంటే… ప్రపంచమంతా సాడిస్ట్లే ఉన్నారు. వాళ్లు నెగటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవటం వలన విలన్ క్యారెక్టర్ అంతగా నచ్చింది. మంచిగా ఉంటే ఈ రోజుల్లో ఎవరికీ నచ్చడం లేదు. అంటూ ఫన్నీ వేలో ఈ మాటను చెప్పాడు నాగ వంశీ. నాగ వంశీ ఏ రకంగా చెప్పిన గాని జనాలు తీసుకునే విధానం ఒకటి ఉంటుంది.
మంచి కలెక్షన్స్
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా జులై 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు బీభత్సమైన బుకింగ్స్ వచ్చాయి. ఆ బుకింగ్స్ సినిమాకి మంచి పాజిటివ్ ఎనర్జీ ని తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం సినిమాకి కూడా కొంతమేరకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపు సగం డబ్బులు వసూలు అయిపోయాయి. ఈరోజు సండే కాబట్టి సినిమాకి మరింత మెరుగుపడే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిజమైన ఆగస్టు 14 వరకు ఈ సినిమాకి పోటీపడే సినిమాలు పెద్దగా లేవు. సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ బట్టి విజయ్ ఏ రేంజ్ సక్సెస్ కొట్టాడో అర్థమవుతుంది.
Also Read: Nani : నాని, సుజిత్ స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, షూటింగ్ మొదలయ్యేది అప్పుడే