Hero Sumanth: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో సుమంత్. దివంగత దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao) కూతురు కొడుకే అయినప్పటికీ.. నాగేశ్వరరావు దగ్గరే పెరుగుతూ వచ్చారు. ఇక ఆయన ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సుమంత్. ‘ప్రేమ కథ’ అనే సినిమాతో 1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన సత్యం, గౌరీ, మధుమాసం, గోల్కొండ హై స్కూల్ , మళ్ళీరావా అనే చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక 2017 తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈయన మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘అనగనగా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇండస్ట్రీ ఎంట్రీపై సుమంత్ కామెంట్స్..
ఇదిలా ఉండగా తాజాగా.. ఈ చిత్ర దర్శకుడు సన్నీ సంజయ్(Sunny Sanjay) తో కలిసి ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు సుమంత్. అందులో భాగంగానే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక చిట్ చాట్ సెషన్ లో భాగంగా ఒక అభిమాని సినీ నేపథ్యం ఉన్న వారిని కూడా ఆడిషన్ చేస్తారా? అని ప్రశ్నించగా సుమన్ మాట్లాడుతూ.. “ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేవారికి ప్రవేశించడం తేలికే గానీ.. అది కొంత వరకు మాత్రమే సహాయం చేస్తుంది. ఇక ఒక స్థాయి దాటాక ఎవరైనా? ఎంతటి వారైనా? ఆడిషన్ ఇవ్వాల్సిందే.
అందుకే నన్ను హిందీ సినిమాలలో రిజెక్ట్ చేశారు – సుమంత్
ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం నేను నాలుగైదు హిందీ ప్రాజెక్ట్లకు ఆడిషన్స్ ఇచ్చాను. కానీ నేను రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు హిందీ భాష పై పట్టు లేకపోవడం వల్లే నన్ను తిరస్కరించారేమో అనుకుంటున్నాను అంటూ వివరించారు. హిందీ భాష రాకపోవడం వల్లే తాను నాలుగు సినిమాలు కోల్పోవలసి వచ్చింది అంటూ కూడా తెలిపారు. ఇక తనకు సినిమాలే ప్రపంచం అని, ఒకవేళ నటుడు కాకపోయి ఉంటే ఆ రంగానికి సంబంధించి ఏదో ఒక పని చేసేవాడిని అంటూ అభిమానులతో చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే సుమంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హీరోల గురించి సుమంత్ ఏమన్నారంటే?
ఇక ఒక్కొక్క హీరో గురించి ఇంటర్వ్యూలో అడగగా.. బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు. అలాగే మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితమే నేను మహేష్ ను కలిసాను. ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు. ఇక నాగార్జున వందవ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పిన సుమంత్ వెంకటేష్ తన రోల్ మోడల్ అని ,రానా స్వీట్ పర్సన్ అని, విజయ్ దేవరకొండ పై ఈర్ష్యగా ఉంది అంటూ ఇలా ఒక్కొక్క హీరో గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ALSO READ:Sekhar master: ఇండస్ట్రీలోకి మరో స్టార్ కిడ్.. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ.. పూర్తి వివరాలివే!