E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ 2 నిర్మాతలతో నాగవంశీ స్పెషల్ ఇంటర్వ్యూ, ఆఖరికి వంశీని ఇలా కూడా వాడుతున్నారు?

Akhanda 2 : అఖండ 2 నిర్మాతలతో నాగవంశీ స్పెషల్ ఇంటర్వ్యూ, ఆఖరికి వంశీని ఇలా కూడా వాడుతున్నారు?
Advertisement

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. గతంలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చాలా స్పీడ్ పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ముంబై వేదికగా విడుదల చేశారు. రెండవ సాంగును వైజాగ్ వేదికగా విడుదల చేశారు. రెండు సాంగ్స్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే నిన్న రిలీజ్ అయిన సాంగ్ మాత్రం కొంచెం ఆసక్తికరంగానే ఉంది. భాను మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

ప్రమోషన్స్ లో నాగ వంశీ 

Advertisement

అఖండ సినిమా ప్రమోషన్స్ లో నాగ వంశీ ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఈ ప్రమోషన్స్ లోకి నాగ వంశీ ఎందుకు వచ్చారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇదే డౌట్ నాగ వంశీ కూడా ఆ నిర్మాతలను అడిగారు. ప్రస్తుతం మీరు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాం అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాను 14 డ్రిల్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఒక సినిమాను ప్రమోట్ చేయడంలో నాగ వంశి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమీ లేని సినిమా కూడా బీభత్సమైన ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు.

Advertisement

కొన్నిసార్లు సినిమాలు బాగున్నా కూడా నాగ వంశీ ఇచ్చిన ఎలివేషన్స్ వాళ్ళని ఆ అంచనాలను అందుకోలేక దెబ్బతింటాయి. 2025లో నాగవంశీ అలా నమ్మకం పెంచిన సినిమాలు కింగ్డమ్, వార్, మాస్ జాతర ఈ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు.

ఫేమస్ అవడం వలనే 

అయితే అఖండ సినిమాకి సంబంధించి నాగవంశీ ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవడం. అది కాకుండా బాలకృష్ణకు నాగవంశీ ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ అంటే నాగ వంశీకు విపరీతమైన ఇష్టం.

వాస్తవానికి భీమ్లా నాయక్ సినిమాకు కూడా మొదట బాలకృష్ణను నాగ వంశి అడిగారు. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని బాలకృష్ణ నే సలహా ఇచ్చారు. ఇకపోతే అఖండ సినిమాకి సంబంధించి నైజాం రైట్స్ కూడా దిల్ రాజుకి ఇప్పించడంలో వంశీ కీలక పాత్ర వహించారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Akhanda2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి మరియు భాయ్

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×