E-Paper
Advertisement

Mahabubnagar Crime: కళ్లెదుటే దారుణంగా కాలిపోయారు.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన

Mahabubnagar Crime: కళ్లెదుటే దారుణంగా కాలిపోయారు.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
Advertisement

Mahabubnagar Crime: జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా ఉన్న సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలను బలిగొంది. పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు విగతజీవులుగా మారడం స్థానికులను కలచివేసింది.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మిల్లులో స్పిన్నింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత యంత్రాల వద్ద ఉన్న వ్యర్థ పత్తిని కార్మికులు తొలగిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడ ఉన్నది పత్తి కావడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కార్మికులు తేరుకునేలోపే దట్టమైన పొగతో పాటు మంటలు చుట్టుముట్టాయి. దీంతో మిల్లు లోపల పని చేస్తున్న ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Advertisement

మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పుతో పాటు బిహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో పప్పున్ సాతి అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి మృతుల్లో ఒకరికి సోదరుడు అవుతాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి పంపించారు. జిన్నింగ్ మిల్లులో సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కళ్లెదుటే తోటి మనుషులు కాలిపోవడాన్ని చూసి మిగతా కార్మికులు భయాందోళనకు గురయ్యారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×