Why Not Hrudayamlo Song not in Movie: విజమ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన కింగ్డమ్ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాల మధ్య గురువారం(జూలై 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్డే ఫస్ట్ షో నుంచి ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఫ్యాన్స్ మాత్రం మా హీరో కొట్టేశాడు.. సినిమా హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక మూవీ టీం కూడా తాజాగా సక్సెస్ మీట్‌ని కూడా పెట్టేసి మూవీ హిట్ అని ప్రకటించుకుంది.
కింగ్ డమ్ సక్సెస్ మీట్
కానీ దీనిపై యాంటి ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ సక్సెస్ మీట్లో నిర్మాత నాగవంశీ చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా హృదయంలో పాటపై ఆయన స్పందించిన తీరుపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రెస్మీట్లో ఓ విలేకరి హృదయంలో పాటను సినిమాలో పెట్టకపోవడంపై ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘అవును.. సినిమా చూశారా? మీరు. చూసిన మళ్లీ ఒకసారి వెళ్లి చూడండి. ఈ పాట ఎక్కడ పెట్టాలో నాకు చెప్పండి. అప్పుడు పెట్టకపోతే అడగండి. సినిమా చూశాక ఈ పాటను పెట్టడం కుదరలేదు.
పాట అందుకే పెట్టలేదు
అప్పటికే సినిమా నిడివి మించిపోయింది. అందుకే హృదయంలో పాటను మూవీలో పెట్టలేకపోయాం‘ అంటూ క్లారిటీ ఇచ్చారు. అనంతరం హృదయంలో పాట పెట్టకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యుంటారే. విజయ్ కిస్ సీన్ మిస్ అయ్యారని బాధపడుతున్నారా? అని చమత్కరించారు. ఇక ఆయన కామెంట్స్ నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలో ఆ పాటకు స్థానం లేనప్పుడు ఎందుకు చేసినట్టు.. లక్షలు పోసి దండగా.. అని అసహనం చూపిస్తున్నారు. కాగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించారు.
Naga vamsi about #HridayamLopala song in #Kingdom pic.twitter.com/65YkDNOrtJ
— Suresh PRO (@SureshPRO_) July 31, 2025
ఇప్పటికే సగం కలెక్షన్స్ వచ్చాయి..
అలాగే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్, కలెక్షన్లపై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మీ హీరో విజయ్ హిట్ కొట్టాడంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అనంతరం మూవీ కలేక్షన్స్ గురించి మాట్లాడుతూ.. యూఎస్లో సినిమాను ఎంత రేటు అమ్మామో అందులో సగం ఫస్ట్ డే వచ్చేశాయి అన్నారు. ఇక హయ్యేస్ట్ కలెక్షన్స్ రాయలసీమలో వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకు వినిపించిన ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో ఈ కింగ్డమ్ దాదాపు రూ. 7 కోట్లు వచ్చాయన్నారు. అసలు లెక్కలపై రేపటిలోగా క్లారిటీ వస్తుందన్నారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని నాగవంశీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా కింగ్డమ్ మూవీ రెండు పార్టులుగా వస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలుగా చేయాలని అనుకున్నామన్నారు.
Also Read: Tollywood: ఆ హీరోయిన్తో స్టార్ హీరో సహజీవనం.. త్వరలోనే పెళ్లి కూడా.. ఇంతకీ వారెవరంటే!