BigTV English

Naga Vamsi : నాకు లెన్త్ ఫోబియా ఉంది, నాకు త్రివిక్రమ్ గారు ఒకటి నేర్పించారు

Naga Vamsi : నాకు లెన్త్ ఫోబియా ఉంది, నాకు త్రివిక్రమ్ గారు ఒకటి నేర్పించారు

Naga Vamsi : ఈ రోజుల్లో సినిమా లెంత్ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ డిసైడ్ చేస్తుంది. పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే సినిమా మూడు గంటలు ఉన్న చూస్తారు. ఇలా డ్యూరేషన్ ఎక్కువ ఉన్న సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు మూడు గంటలు మించున్నా కూడా మంచి సక్సెస్ సాధించాయి.


సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక కింగ్డమ్ సినిమా విషయానికొస్తే డ్యూరేషన్ కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా డ్యూరేషన్ గురించి నాగ వంశీ మాట్లాడారు.

నాకు లెన్త్ ఫోబియా ఉంది 


నాగ వంశీ  కింగ్డమ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో మొదట విడుదల చేసిన హృదయం లోపల అనే పాట సినిమాలో ఉండదు. ఈ పాట గురించి చాలామంది బయటకు వచ్చిన తర్వాత కామెంట్స్ చేశారు. అయితే నాగ వంశీ కూడా దీని గురించి మాట్లాడుతూ ఈ పాట ఏ ప్లేస్ మెంట్ లో సరిపోతుంది అని ఎదురు ప్రశ్న కూడా వేశారు. వాస్తవానికి ఈ పాట సెకండాఫ్ లో ఉండాలి. కానీ సినిమా అక్కడ డౌన్ అవుతుంది అని తెలుసు కాబట్టి పాటను లేపేసారు. అయితే ఈ సినిమా పెద్ద లెంత్ కూడా కాదు ఎందుకు పాటను లేపిశారు అని మళ్లీ ప్రశ్నిస్తే… నాకు లెన్త్ ఫోబియా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ పాట ఇక్కడ అనవసరం అనిపించింది. ఈ పాట లేపిస్తే డ్యూరేషన్ కలిసి వస్తుంది కదా అని ఉద్దేశంతోనే ఆ పాటను తీసేసాం. సోమవారం నుంచి ఆ పాటను కూడా పెడుతున్నాం అంటూ నాగ వంశీ తెలిపాడు.

నాకు త్రివిక్రమ్ గారు ఒకటి నేర్పించారు 

సినిమా డ్యూరేషన్ అనేది ఫిజికల్ గా కాదు మెంటల్ గా చూడాలి అని చెప్పారు. ఒక సినిమాను చూస్తున్నప్పుడు ఆ సినిమా నీకు ఎంగేజింగ్ గా అనిపిస్తే మూడు గంటలు ఉన్న పరవాలేదు. ఆ సినిమా నీకు ఎంగేజింగ్ గా లేదు అని తెలిస్తే గంట నలభై నిమిషాలు సినిమా రిలీజ్ చేసిన పరవాలేదు. అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాగవంశీకి చెప్పారట. బహుశా నాగ వంశీ అలానే ఆలోచించి, ఇక్కడ ఈ పాట అనవసరం అని తీసేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది

Also Read: Vijay Devarakonda: రవి కిరణ్ కోలా కథ ఏంటో చెప్పేసిన విజయ్

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×