Indian Railways: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలోని ఆన్ లైన్ రైల్వే టికెటింగ్, క్యాటరింగ్, పర్యాటక సేవలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా కొనసాగుతోంది. ఇది ప్రయాణికులకు టిక్కెట్లు, భోజనం, హాలిడే ప్యాకేజీలను సులభంగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. చాలా ఏళ్లుగా IRCTC ఇ-క్యాటరింగ్, రైల్ మదద్, ఆన్ బోర్డ్ సేవలను అందిస్తోంది. IRCTC కార్యకలాపాలు, కస్టమర్ కేర్ తో ప్రయాణీకులకు సులభమైన రైలు ప్రయాణాలకు ఎతంగానో ఉపయోగపడుతుంది. ఇక సాధారణంగా రైళ్లలో భోజనం కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ఉచిత భోజనం పొందే అవకాశం ఉంటుంది. ఏ సందర్భాల్లో అలా ఆహారాన్ని అందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ప్రీమియం రైళ్లు ఆలస్యం అయినప్పుడు
రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైళ్లలోని ప్రయాణీకులు తమ రైళ్లు 2 గంటలు, అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే ఉచిత భోజనం పొందవచ్చు. బుకింగ్ సమయంలో వారు భోజనాన్ని ఎంచుకుంటేనే ఉచిత భోజనాన్ని అందిస్తారు. ఈ ఉచిత భోజనంలో సాధారణంగా కిచిడి, దాల్ చావల్ లాంటి సాధారణ ఆహార పదార్థాలు ఉంటాయి .
⦿ బుకింగ్ సమయంలో అందుబాటులో ఉన్న ఫుడ్ ఆప్షన్స్
రైల్వే ప్రయాణీకులు IRCTC ద్వారా భోజనాలను బుక్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా శాకాహారం, మాంసాహార భోజనం వారికి రైలులో అదనపు ఛార్జీ లేకుండా అందించబడుతుంది. ఈ ఫుడ్ సెలెక్షన్ ప్రధానంగా సుదూర రైళ్లు, లగ్జరీ రైళ్లకు అందుబాటులో ఉంది.
⦿ డిస్కౌంట్ల కోసం ఇ-క్యాటరింగ్ యాప్, కూపన్లు
IRCTC ఇ-క్యాటరింగ్ ప్లాట్ ఫామ్ రైల్ రెస్ట్రో లాంటి భాగస్వాముల ద్వారా ఆర్డర్ చేయడం వల్ల కొంత డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా ముందస్తుగా బుకింగ్ చేసుకునేటప్పుడు, పండుగ సీజన్లలో, సేల్ సీజన్ లో అనేక డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు , ప్రోమో కోడ్‌లు అందిస్తున్నాయి. వీటి ద్వారా తక్కువ ధరకు ఆహారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
⦿ ప్యాంట్రీ విక్రేతల అధిక ఛార్జీల బారిన పడకండి
ప్యాంట్రీ విక్రేతలు మ్యాండేటరీ కాని భోజనాల కోసం ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే, మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్న బిల్ అడగండి. IRCTC ఆమోదించిన ప్రింట్ మెనూల నుంచి మాత్రమే ఆర్డర్ చేయండి. ఒకవేళ అధిక ధరలకు ఆహార పదార్థాలను అమ్మితే రైల్ మదద్ యాప్ లేదంటే వెబ్ సైట్ ద్వారా కంప్లైంట్ చేయండి. చాలా మంది రైల్వే ఫుడ్ నచ్చక, ఇంటి నుంచే ఆహార పదార్థాలను తెచ్చుకుంటారు. ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ, ఈ మధ్య రైల్వే కోచ్ లలో ఆహారాన్ని అడ్డగోలుగా పడేయడం వల్ల రైల్వే అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా హోం ఫుడ్ తీసుకెళ్తే తినే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది.
Read Also: దేశంలోనే అతిపెద్ద రైల్వే వంపు, ఎక్కడో కాదు మన రాజమండ్రిలోనే!