ఆధునిక కాలంలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం కష్టంగా మారిపోయింది. ఎంతోమంది యువత కలగానే ఇది మిగిలిపోతోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పరీక్షలు రాస్తూనే ఉంటారు. కానీ అందులో చాలా తక్కువ మందికే ప్రభుత్వ ఉద్యోగం దక్కుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వారు కూర్చునే దిశ వంటివి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలను నిర్ణయిస్తాయి. మరి అలాగే ఉద్యోగాలు మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వాస్తు సరైనది అయితే కృషి, అంకిత భావం అన్నీ కలిసి మంచి ఫలాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేసుకోండి. ఇది వాస్తు పరంగా మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది.
ఉత్తర ముఖంగా
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం మీరు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతిసారీ లేదా చదువుతున్న ప్రతిసారి మీ ముఖాన్ని ఉత్తరం లేదా తూర్పు వైపుగా ఉంచండి. ఈ దిశ సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. స్టడీ టేబుల్ కూడా ఉత్తరం గోడకు లేదా తూర్పు దిశ గోడకు ఉండేలా చూసుకోండి. అలాగే ఆ గోడపై స్ఫూర్తిదాయకమైన కోట్స్ ఉంచండి. లేదా సరస్వతి దేవి చిత్రపటాన్ని ఉంచండి. ఇది వాస్తు పరంగా ఎంతో సానుకూలతనో ఇస్తుంది.
పసుపు పువ్వులు
మీరు చదువుకునే స్టడీ టేబుల్ మీద పువ్వులు పెట్టడం మర్చిపోవద్దు. ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధించాలంటే స్టడీ టేబుల్ పైన తాజాగా ఉండే పసుపు రంగులో ఉండే పువ్వులు పెట్టుకోవాలి. లేదా క్రిస్టల్ బాల్ ఉంచండి. బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ కలిసి మీ శక్తిని మరింతగా పెంచుతారు. చదువుపై ఆసక్తిని చెక్కుచెదరకుండా కాపాడుతారు. పువ్వులు ఎండిన వెంటనే మార్చేయాలి. లేకుంటే అక్కడ ప్రతికూల శక్తి వ్యాపించే అవకాశం ఉంది.
వాస్తు ప్రకారం ఇంటి నైరుతి మూలలో స్థిరత్వం, కెరీర్ కు చెందినదిగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి నైరుతి మూలలో మురికి లేకుండా, వస్తువుల చిందరవందరంగా పడేయకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఆ మూలలో ఒక చెక్క గ్లోబు లేదా మ్యాప్ ఉంచండి. అది మీ లక్ష్యాల్ని సూచిస్తుంది.
ప్రతిసారి మీరు చదువును ప్రారంభించేముందు లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు దీపం వెలిగించి ‘ఓం గణ గణపతయే నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. కెరీర్లో స్థిరత్వాన్ని తెస్తుంది. వీలైతే మీ ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో తులసి మొక్కను పెట్టుకోవడం మర్చిపోవద్దు.
ఉద్యోగం ప్రయత్నంలో పదే పదే అడ్డంకులు వస్తున్నట్టయితే శనివారం రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించండి. అలాగే శని మంత్రాన్ని జపించండి. ఈరోజున పేదవారికి నల్ల మినములు, ఇనుప వస్తువులు, నల్లని దుస్తులు దానం చేసినా కూడా ఎంతో మంచిది.
ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కేవలం వాస్తు చిట్కాలను పాటిస్తే కుదరదు.. కష్టపడి చదవాలి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. వాటితో పాటు ఈ చిన్న చిన్న వాస్తు నివారణలు మీకు విజయాన్ని అందిస్తాయి.