Vijay Devarakonda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మొదటి సినిమాతోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు పేరును సంపాదించుకుంటారు. అలా వచ్చిన దర్శకుల్లో రాజావారు రాణి గారు సినిమాతో రవికిరణ్ కోలా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు దర్శకుడుగా మరో సినిమా చేయలేదు.
కానీ రవి కిరణ్ కోలా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాకు కథను అందించి, సినిమా మొత్తాన్ని దగ్గరుండి నడిపారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. విశ్వక్సేన్ కెరియర్ కి కూడా ఆ సినిమా మంచి ప్లస్ అయింది. ఇక ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
కథకు ఇన్స్పిరేషన్ ఇదే
డైరెక్టర్ రవి కిరణ్ కోలాఈ కథను రియాలిటీ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశాడు. మెయిన్ గా వాళ్ళ ఫాదర్ ను ఇన్స్పైర్ అయ్యి రాశాడు. ఫిక్షన్లైజ్ గా కూడా ఉంటుంది. ఈ సినిమా ఒక స్మాల్ టౌన్ లో జరుగుతుంది. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు కాబట్టి. విజయ్ చెప్పిన ఈ మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి. రాజావారు రాణి గారు సినిమా కూడా విపరీతంగా చాలామందికి కనెక్ట్ అయింది. దానికి కారణం ఆ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ చాలామంది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండటం. అటువంటి దర్శకుడు నుంచి మరో సినిమా వస్తుంది అంటే అంచనాలు వేరే రేంజ్ లోనే ఉంటాయి. అయితే విజయ్ తో చేయబోయే సినిమాకి రౌడీ జనార్ధన్ అనే టైటిల్ అనుకున్నట్లు కూడా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో రివిల్ చేశారు.
విజయ్ దేవరకొండ కమిట్మెంట్స్ ఇవే
కింగ్డమ్ సినిమాకి పార్ట్ 2 రానున్న సంగతి తెలిసిందే. కానీ అది ఇప్పట్లో జరగదు. ఆల్రెడీ రాహుల్ తో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు విజయ్. అలానే రవి కిరణ్ కోలాతో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ రెండు సినిమాలకు ఏడాదిన్నర టైం పడుతుంది. ఆ తరువాతే కింగ్డమ్ సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది అంటూ తెలిపాడు విజయ్. అయితే ఈ రెండు సినిమాలకి కూడా ఒకేసారి డేట్స్ ఇవ్వనున్నాడు, ఈ సినిమాకి కొన్ని రోజులు ఆ సినిమాకి కొన్ని రోజులు ఇస్తూ రెండు సినిమాలని పూర్తిచేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్.
Also Read: Naga Vamsi: సినిమాని తప్పు అనలేదు, ఆ డైరెక్టర్ కు సారీ