Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా దూసుకుపోతున్న నటుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున(Nagarjuna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన తండేల్ (Thandel)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈయన వ్యక్తిగత జీవితం అలాగే వృత్తిపరమైన జీవితం తెరిచిన పుస్తకమే అని చెప్పాలి.
పస్ట్ క్రష్ మాజీ విశ్వ సుందరి..
ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ క్రష్(First Crush) గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు పస్ట్ క్రష్ ఉంటారు. అలాగే నాగచైతన్య జీవితంలో కూడా ఫస్ట్ క్రష్ ఉన్నారని ఆమె ఎవరునే విషయాన్ని బయట పెట్టారు. “నా ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ (Sushmita Sen)అంటూ నాగచైతన్య అసలు విషయం బయట పెట్టారు. ఇక ఈ విషయం గురించి ఆమెను కలిసినప్పుడు తాను చెప్పానని వెల్లడించారు”. ఇకపోతే తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ గురించి కూడా ఈ సందర్భంగా నాగచైతన్య బయటపెట్టారు.
అలియా భట్ నటన చాలా ఇష్టం…
“తనకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)నటన అంటే చాలా ఇష్టమని ఆమెతో సినిమా చేసే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితులలో కూడా వదులుకోను” అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి అలియా భట్ నటన అంటే అంత ఇష్టపడుతున్న చైతన్యకు ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తుందా?రాదా? అనేది తెలియాల్సి ఉంది. తనకి ఇష్టమైన హీరోయిన్ గురించి నాగచైతన్య ఈ కామెంట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. ఇక చైతు వ్యాఖ్యలపై నెటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
శోభితతో సంతోషంగా చైతూ…
ఇకపోతే చైతన్య ఇప్పటికే నటి సమంత (Samantha)ను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లైన మూడు సంవత్సరాలకి వీరిద్దరూ విడాకులు(Divorce)తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య తిరిగి మరో నటి శోభిత (Sobhita)ప్రేమలో పడటం ఆమెను ఇటీవల పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత నాగచైతన్య శోభిత తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉందని పలు సందర్భాలలో వెల్లడించారు. శోభిత సైతం పెళ్లి తర్వాత పలు సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇలా వీరిద్దరూ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉంటూనే తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: Venky Atluri: ఆ హిట్ సినిమాకు సీక్వెల్… స్క్రిప్ట్ కూడా రెడీ.. క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!