Fish Venkat Health: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నారు. సినిమాల్లో కనిపించేది కొద్దిసేపు అయినా కూడా తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ద్వారా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే సినిమా వాళ్లు ప్రేక్షకులను నవ్విస్తారు కానీ వాళ్ల జీవితాల్లో ఎప్పటికీ కొన్ని కష్టాలు ఉంటూనే ఉంటాయి. వాటిని అందరితో పంచుకోలేరు. కానీ కొన్ని సందర్భాల్లో అవి చెప్పుకోవాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చాలామంది వాళ్లకు తెలిసిన కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. ఆ ఫ్యామిలీ ప్రస్తుతం బాధల్లో ఉంది. ఈ తరుణంలో ఆయనకు ప్రభాస్ హెల్ప్ చేస్తారు అని ఒక పర్సన్ ప్రభాస్ పేరు మీద కాల్ చేశాడు. నేను ప్రభాస్ వాళ్ళ పిఏను సార్ ఆపరేషన్ చేస్తా అంటున్నారు అంటూ కాల్ చేశారు. దీనిని కుటుంబ సభ్యులు వాస్తవం అని నమ్మారు. కానీ తిరిగి అతను ఫోన్ చేయలేదు. ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు.
ప్రభాస్ ఫేక్ పిఏ
రీసెంట్ టైమ్స్ లో మనుషులు ఎలా తయారయ్యారు అంటే ఒక విషయం కోసం ఎంతవరకైనా తెగించడం మొదలుపెట్టారు. కేవలం తమ హీరో పేరును ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు బయటపెడతారు అని ఉద్దేశంతోనే ప్రభాస్ హెల్ప్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం ప్రభాస్ కు కూడా తెలియదు. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు. చాలామందికి ప్రభాస్ హెల్ప్ చేశారు. ప్రభాస్ వ్యక్తిత్వం అలాంటిది. అందుకోసమే ప్రభాస్ పిఏ అంటే నమ్మేశారు. తర్వాత ఫేక్ అని తెలిసి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చేసిన వ్యక్తి పైన చాలామంది మండిపడుతున్నారు.
ఫోన్ నెంబర్ బయట పెట్టిన బిగ్ టీవీ
ప్రముఖ ఛానల్ బిగ్ టీవీ ప్రభాస్ పేరు మీద ఫోన్ చేసిన వ్యక్తితో లైవ్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫోన్ నెంబర్ కలవకపోవడం వలన, అదే ఫోన్ నెంబర్ను పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ప్రభాస్ పిఏ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి పేరు నవీన్. అతని ఫోన్ నెంబర్ 8143254578. అలానే బిఆర్ఎస్ పార్టీ నేత కవిత పేరు మీద కూడా ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ఒకవైపు కుటుంబం దుఃఖసాగరంలో ఉంటే ఇలా వాళ్లతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ మండిపడుతున్నారు.
Also Read: Sukumar: మీ వల్లనే నాకు ఇంకో సినిమా అవకాశం వచ్చింది, సుకుమార్ ఎమోషనల్