Anchor Lasya: లాస్య (Lasya)బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఒకప్పుడు వరుస కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న లాస్య అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి కూడా అడుగుపెట్టారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని వీడియోలను తెలియజేస్తూ తన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం లాస్య తాము కొత్త ఇల్లు(New House) కొనుగోలు చేశామని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కొత్త ఇంట్లోకి లాస్య దంపతులు అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని చాలా సింపుల్ గా జరిపించినట్టు ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. నిజానికి ఆ ఇల్లు ఇంకా ఇంటీరియర్ వర్క్ పూర్తికాని నేపథ్యంలో అందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించలేదని స్పష్టమవుతుంది. ఇక ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా సింపుల్ గా సాంప్రదాయబద్ధంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంత ఇంటి కోసం ఎంతో కష్టపడుతూ వారి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఇక లాస్య దంపతులకు ఇప్పటివరకు కూడా సొంత ఇల్లు లేని నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఇంటిని కొనుగోలు చేసినట్టు ఇటీవల ఒక వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఇంటి పనులన్నీ పూర్తి అయిన తరువాత ఈమె ఘనంగా వ్రతం నిర్వహించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం.
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..
ఇక లాస్య వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె.. పెద్దలను ఎదిరించి మంజునాథ్ (Manjunath)అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున యుద్ధాలు చేసినట్లు పలు సందర్భాలలో లాస్య వెల్లడించారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్న లాస్య తన వృత్తిపరమైన జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
Also Read: Sreeleela: ఏంటీ శ్రీలీల ఆ విషయంలో ఇలాంటి సెంటిమెంట్ లు కూడా ఉన్నాయా..