Kubera: ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna), ధనుష్ (Dhanush) కలయికలో వస్తున్న చిత్రం కుబేర(Kubera ). ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానీ ఈ విషయం ప్రేక్షకులకు షాక్ కలిగించే అంశం అని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కల్పించింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధరను జిఎస్టి తో కలిపి 75 రూపాయల వరకు పెంచుకునేలా అనుమతి కల్పించింది. అంతేకాదు పెంచిన ధరలు మరో 10 రోజులపాటు అమలులో ఉండనున్నాయి. ఏది ఏమైనా పెంచిన టికెట్ ధరలు చిత్ర బృందానికి లాభాన్ని కలిగించినా.. ప్రేక్షకులకు మాత్రం భారం అని చెప్పవచ్చు. ఇక భారీ అంచనాల మధ్య శుక్రవారం రోజు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
తమిళనాట కుబేర మూవీకి తప్పని తిప్పలు..
వాస్తవానికి ఈ సినిమా విషయంలో మొదటి నుంచి ప్లానింగ్ లోపం కనిపిస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లోనే కాదు ఆఖరికి ప్రమోషన్స్ విషయంలో కూడా ఇది బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు ఫస్ట్ కాపీ రెడీ అవ్వకపోవడం, ఇంకొక వైపు పాటలు విడుదల చేయకపోవడం, దీనికి తోడు నటీనటులతో ప్రచారం చేయించలేకపోవడం ఇవన్నీ యూనిట్ కి పెద్ద మైనస్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి మరో లోపం కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి రాబోతుండగా .. తమిళనాట ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడం గమనార్హం. ధనుష్ కి తెలుగు కంటే తమిళ్ లోనే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు కోలీవుడ్లో కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి..అలాంటి హీరోతో సినిమా చేస్తే ఇప్పుడు కోలీవుడ్లో ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకపోవడం ఈ చిత్రానికి అక్కడ తిప్పలు తప్పేలా లేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Uppu Kappurambu Trailer: ఉప్పుకప్పురంబు ట్రైలర్.. స్మశానంలో సమాధుల కోసం పోటీ, చచ్చే ఆ నలుగురు ఎవరో?
చిత్ర బృందం నిర్లక్ష్యమే కారణమా?
ఇకపోతే ఈ సినిమా తమిళ వెర్షన్ సెన్సార్ ఫార్మాలిటీస్ ఒకవైపు చెన్నైలో జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్ , తమిళ్ వెర్షన్ కి రన్ టైం లో కూడా కొంచెం తేడా ఉంది. సెన్సార్ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే మొదలవ్వాలి. కానీ ఇందులో ఆలస్యం అయింది. దీనికి కారణం చిత్ర బృందం నిర్లక్ష్యమే అని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కాస్త జాగ్రత్త పడి అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలి అని అభిమానులు కోరుతున్నారు.