The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. నాలుగు, ఐదు పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ త్వరలోనే ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జనవరి 9వ తేదీ 2026న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ మరి కొంతమంది ఈ ట్రైలర్ పై విమర్శలు కూడా కురిపిస్తున్నారు.
ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా విఎఫ్ఎక్స్ పూర్ గా ఉందని, ఈ సినిమా మరో ఆదిపురుష్ కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో నెగిటివిటీ రావడంతో ప్రభాస్ వెంటనే ఈ సినిమా చూసినట్టు తెలుస్తోంది. అయితే సినిమా చూసిన ప్రభాస్ ఈ సినిమా విషయంలోనూ అలాగే విఎఫ్ఎక్స్ విషయంలో కూడా సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇప్పటివరకు సినిమా చాలా అద్భుతంగా రావడంతో తదుపరి షెడ్యూల్ కి కూడా చిత్ర బృందం ప్లాన్ చేశారని తెలుస్తోంది. 20 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో రెండు పాటలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం గ్రీస్ వెళ్లబోతున్నారని టాలీవుడ్ సమాచారం. ఇక ఈ సినిమా కామెడీ హర్రర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నామని సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టమవతుంది. లుక్స్ పరంగా ప్రభాస్ ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు.
ప్రభాస్ కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు…
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కు తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్(Nidhi Agarwal) తో పాటు, రిద్ధి కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్(Malavika Mohanan) కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో యూట్యూబ్ లో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ ట్రైలర్ వీడియో చూసిన అభిమానులు ప్రభాస్ ను ఇలా చూసి చాలా కాలం అవుతుంది, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?