E-Paper
Advertisement

ఎమోషనల్ పోస్ట్ ఓకే.. కానీ ‘కింగ్ 100’ అప్‌డేట్ ఎక్కడ .. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఎమోషనల్ పోస్ట్ ఓకే.. కానీ ‘కింగ్ 100’ అప్‌డేట్ ఎక్కడ ..  ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
Advertisement

King 100 : నాగ్ కెరీర్ లో ఎన్ని మెమరబుల్ తేదీలు ఉన్నా ఈ రోజు.. అంటే మే 23 అనే తేదీకి మాత్రం ఒక స్పెషల్ హిస్టరీ ఉందనే చెప్పాలి.అవును..కారణం సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆయన హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ సినిమా విడుదలైంది మరి.హిందీలో జాకీ శ్రోఫ్ నటించిన బ్లాక్ బస్టర్ ‘హీరో’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను వి. మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. ఇక చేసిన మొదటి సినిమాతోనే మాస్ హీరోగా నాగ్ మంచి మార్కులు కొట్టేసాడు.అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను ఏలేసాడు.

కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్

Advertisement

అయితే ఇదే తేదీకి ఉన్న మరో మెమరబుల్ సెంటిమెంట్ ఏంటంటే.. అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన క్లాసిక్ మూవీ ‘మనం’ రిలీజైంది కూడా మే 23నే. ANR చివరి చిత్రంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఈ సినిమాను కూడా నాగార్జున కొడుకుగా తండ్రికిచ్చిన గొప్ప నివాళిగా స్వంత బ్యానర్ లోనే నిర్మించారు. నాగార్జున సైతం సోషల్ మీడియా వేదికగా ఈ ప్రత్యేకమైన రోజును గుర్తుచేసుకుంటూ, తన 40 ఏళ్ల ప్రస్థానానికి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. భవిష్యత్తులో మరిన్ని మే 23లను ఇలానే సెలబ్రేట్‌ చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

అంతా బాగానే ఉంది కానీ, ఇంతటి చారిత్రాత్మకమైన రోజున అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఒక క్రేజీ అప్‌డేట్ రాకపోవడం మాత్రం ఫుల్ డిసప్పాయింట్ చేసేసింది.అవును..నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వందో సినిమా ‘కింగ్ 100’ షూటింగ్ ప్రస్తుతం సైలెంట్‌గా జరుగుతోంది. కోలీవుడ్ ఫేమ్ ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా దాదాపు సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుందని ఇండస్ట్రీ టాక్. నాగ్ చాలా చలాకీగా, యంగ్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ, అఫీషియల్ గా మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ వదల్లేదు.

 ఒక్క ముక్క కూడా ప్రస్తావించని నాగ్ 

పోనీ కనీసం ఈ స్పెషల్ డే రోజున ఒక చిన్న పోస్టర్ లేదా ఫస్ట్ లుక్ టీజర్ లాంటిది వదిలితే బాగుండేదని బాధ పడిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. నాగార్జున తన పోస్ట్‌లో గత స్మృతులను నెమరవేసుకున్నారు తప్ప, తన ల్యాండ్‌మార్క్ 100వ సినిమా గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

also read :ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్.. నేడే భోపాల్‌లో ‘పెద్ది’ హంగామా.. రెహమాన్ టీం లైవ్ పెర్ఫార్మెన్స్!

ఈ వందో సినిమా విషయానికి వస్తే ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట. ఒకప్పుడు నాగార్జున కి జోడీగా ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి ఇండస్ట్రీ హిట్, ‘మా ఆవిడే’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన టబు మళ్ళీ నాగ్ కి జోడీగా ఈ సినిమాలోనే కనిపించనుంది . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జున కెరీర్ బెస్ట్ స్టైలిష్ పాత్రలైన ‘శివ’, ‘రక్షకుడు’, అంతెందుకు రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ఆయన పోషిస్తున్న సైమన్ లాంటి పవర్‌ఫుల్ గెటప్‌లను గుర్తుచేసేలా విభిన్నమైన లుక్స్‌లో కనిపించబోతున్నారని రా కార్తీక్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు కూడా.

డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ 

ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, 2027 సంక్రాంతికి ‘బంగార్రాజు’ సీక్వెల్ రాకముందే ఈ ఏడాది ‘కింగ్ 100’ థియేటర్లలోకి రావాలి.మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న సినిమా గురించి, కనీసం ఒక చిన్న అప్‌డేట్ కూడా ఇవ్వకుండా మే 23 లాంటి అరుదైన రోజును కేవలం పాత జ్ఞాపకాలకే పరిమితం చేయడం ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదు. మొత్తానికి అక్కినేని అభిమానులు ఈ పండగ రోజున పెద్ద డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి .

also read :ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×