E-Paper
Advertisement

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాన్ బెయిలబుల్ వారెంట్?

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాన్ బెయిలబుల్ వారెంట్?
Advertisement

Daggubati Family: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలగా, హీరోలుగా దగ్గుబాటి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. అయితే గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం దక్కన్ కిచెన్ (Deccan Kitchen)కూల్చివేత అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దక్కన్ కిచెన్ కూల్చివేత నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్, రానా అభిరాంపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిపై గత కొన్ని నెలల క్రితం ఫిలింనగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నాన్ బెయిలబుల్ వారెంట్ ..

ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగా దగ్గుబాటి కుటుంబ సభ్యులను విచారణకు హాజరు కావాల్సి ఉందని నాంపల్లి కోర్టు పలు సందర్భాలలో దగ్గుబాటి హీరోలకు నోటీసులు జారీ చేశారు. ఇలా ఎన్నో సందర్భాలలో కోర్టు విచారణకు రమ్మని పిలిచినప్పటికీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరు కానట్లు సమాచారం. దీంతో కోర్ట్ ఈ హీరోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దక్కన్ కిచెన్ కేసులో భాగంగా కోర్టు విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదని కోర్టు హెచ్చరించిందనేది ఆ వార్తల సారాంశం. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని న్యాయస్థానం వారిని ప్రశ్నించిందని, ఇలాంటి విషయాలలో సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదు అంటూ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిందని పలు మీడియా కథనాలు శుక్రవారం వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తల్లో నిజం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

కేసు వేసిన నందకుమార్..

Advertisement

ఇలా పలు సందర్భాలలో కోర్టు విచారణకు హాజరుకమ్మని ఆదేశాలు జారీ చేసినప్పటికీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు మాత్రం ధిక్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఫిలింనగర్ లో ఉన్న దక్కన్ కిచెన్ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ దక్కన్ కిచెన్ ను నందకుమార్(Nanda Kumar) అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అయితే లీజు గడువు పూర్తి కాకుండానే, లీజు ఒప్పందం కోర్ట్ ఆదేశాలను ధిక్కరిస్తూ దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఈ కిచెన్ కూల్చి వేసిన సంగతి తెలిసిందే.

వ్యక్తిగత బాండ్లు సమర్పించాలి..

Advertisement

ఇలా లీజు ఒప్పందం పూర్తి కాకుండానే దక్కన్ కిచెన్ కూల్చి వేసిన నేపథ్యంలో నందకుమార్ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమే విచారణకు హాజరుకావాలని పలు సందర్భాలలో నోటీసులు అందించిన హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరై వ్యక్తిగత బాండ్లను సమర్పించాల్సి ఉన్నప్పటికీ వీరు కోర్టుకు హాజరుకాని నేపథ్యంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది. మరి ఇప్పటికైనా ఈ హీరోలు కోర్టు విచారణకు హాజరై సమర్పిస్తూ వివరణ ఇచ్చుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ ఇంటిని చూశారా.. వైరల్ అవుతున్న హోమ్ టూర్ వీడియో..

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×