Daggubati Family:దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family)కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు. మూవీ మొగల్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న నిర్మాత రామానాయుడు (Rama Naidu) వారసులుగా ఇండస్ట్రీలోకి సురేష్ బాబు (Suresh Babu), వెంకటేష్ (Venkatesh) లు ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళ వారసులుగా రానా (Rana), అభిరామ్ (Abhiram)లు ఎంట్రీ ఇచ్చారు. అలా దగ్గుబాటి ఫ్యామిలీకి ముందు నుండి ఇండస్ట్రీలో ఎంతో మంచి గౌరవం ఉంది.అయితే అలాంటి పేరున్న కుటుంబం తాజాగా కోర్టు మెట్లు ఎక్కబోతుంది. మరి రానా,వెంకటేష్ (Venkatesh), సురేష్ బాబులు (Suresh Babu)కోర్టు మెట్లు ఎక్కడానికి కారణం ఏంటి..? కోర్టు వీరిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దగ్గుబాటి ఫ్యామిలీ పై కోర్ట్ ఆగ్రహం..
గత కొద్ది రోజుల నుండి దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఒక వార్త మీడియాలో వైరల్ గా మారుతోంది.అదేంటంటే ఫిలింనగర్ లో ఉన్న దక్కన్ కిచెన్(Deccan Kitchen) వివాదం.. వెంకటేష్,రానా,సురేష్ బాబులు దక్కన్ కిచెన్ స్థల వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.. అయితే ఇప్పటికే కోర్టు పలుమార్లు వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా డేట్ లతో సహా ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఇప్పటికీ కూడా వీరిలో ఏ ఒక్కరు కోర్టుకి హాజరు కాకుండా పబ్బం గడుపుతున్నారు. తమ సినిమా షూటింగులు చూసుకుంటూ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో తాజాగా కోర్టు వీరిపై ఆగ్రహించింది. కచ్చితంగా ఆగస్టు 1న కోర్టుకు హాజరు కావాల్సిందేనని.. ఒకవేళ హాజరు కాకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించింది.
అసలేం జరిగిందంటే?
మరి ఇంతకీ ఈ దక్కన్ కిచెన్ వివాదం ఏంటి.. ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ ఎందుకు ఇరుక్కుంది అనే విషయానికి వస్తే.. ఫిలింనగర్ లో ఉన్న నందకుమార్ (Nanda Kumar)కి సంబంధించినటువంటి దక్కన్ కిచెన్ స్థలం విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి, నందకుమార్ కి మధ్య వివాదం చెలరేగింది.ఆ తర్వాత ఈ స్థల వివాదం గురించి దగ్గుబాటి ఫ్యామిలీ పై నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలోనే 2022లో బౌన్సర్లతో కలిసి జిహెచ్ఎంసి(GHMC) సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. అయితే ఈ స్థలం గురించి కోర్టులో కేసు నడుస్తోంది.ఈ స్థలంపై ఎవరూ కూడా చర్యలకు దిగవద్దు అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా బేఖాతరు చేశారు. అలాగే మరోసారి 2024లో దగ్గుబాటి ఫ్యామిలీ దౌర్జన్యంతో హోటల్ని పూర్తిగా కూల్చివేయడంతో నందకుమార్ దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు పెట్టారు. అయితే ఈ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీని పూర్తిగా విచారణ చేయాలని నాంపల్లి హైకోర్టు (Nampally High Court)ఫిలింనగర్ పోలీసులకు అప్పజెప్పింది.
ఇప్పటికైనా హాజరవుతారా?
దాంతో ఫిలింనగర్ పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీ పై 448, 452,458,120 బి వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా దగ్గుబాటి ఫ్యామిలీ దౌర్జన్యంతో దక్కన్ కిచెన్ కూల్చి వేశారని నంద కుమార్ గత కొద్ది సంవత్సరాల నుండి వీరిపై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు రాకుండా.. పిలిచిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ దగ్గుబాటి ఫ్యామిలీ తప్పించుకొని తిరుగుతుందట. ఇక వీళ్ళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆగస్టు ఒకటిన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.మరి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించి దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు వస్తారా.. ? లేకపోతే మరోసారి కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ALSO READ:3BHK OTT: ఓటీటీలో ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ 3BHK సొంత ఇంటి కల.. రికార్డ్స్ మోత మోగాల్సిందే!