3BHK OTT :ఈ మధ్యకాలంలో విభిన్నమైన కంటెంట్ ను ఎంచుకుంటూ.. ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సిద్ధార్థ్ (Siddharth) . ఇదివరకే ‘చిన్నా’ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు 3BHK అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరో సిద్ధార్థ్, ఆర్ శరత్ కుమార్ (R.Sarath Kumar), మీతా రఘునాథ్, దేవయాని(Devayani ) తదితరులు నటించిన తమిళ్ కామెడీ డ్రామా మూవీ 3BHK. చిన్న సినిమాగా జూలై 4వ తేదీన థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శ్రీ గణేష్ (Sri Ganesh) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అటు విమర్శకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూ లభించింది.
ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ 3BHK..
మధ్యతరగతి కుటుంబం, రోజువారి కష్టాలు, వారి కలలను ఈ సినిమా ద్వారా వెండితెరపై చాలా చక్కగా చూపించారు. సొంత ఇంటి కల అనేది ప్రతి సామాన్యుడి చిరకాల కోరిక అని చెప్పవచ్చు. ఇక ఆ కలను నెరవేర్చుకోవడంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతాయి.. దానిని ఎలా పరిష్కరించగలిగారు.. అనే కాన్సెప్ట్ తో నిజజీవితాన్ని ప్రదర్శిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఆడియన్ హృదయానికి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. అలా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకొని ఒక నెల తర్వాత ఇప్పుడు ఓటీడీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ వేదికగా..
ఆగస్టు 1 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కల అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటు ఓటీటీ ప్రియులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా విదేశాలలో ‘సింప్లీ సౌత్’ అనే ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఎలాంటి రేటింగ్ అందుకుంటుందో చూడాలి.
3BHK సినిమా విశేషాలు..
3BHK సినిమాకి శ్రీ గణేష్ రచన దర్శకత్వం వహించగా శాంతి టాకీస్ ఆధ్వర్యంలో అరుణ్ విశ్వ నిర్మించారు. అరవింద్ సచ్చిదానందం రచించిన 3BHK వీడు (3BHK ఇల్లు) అనే చిన్న కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో యోగి బాబు, సుబ్బు పంచు, వివేక్ ప్రసన్న, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.. ఇకపోతే ఆర్.శరత్ కుమార్, దేవయాని ‘సూర్యవంశం’ తర్వాత తిరిగి కలిసి నటించిన చిత్రం కావడంతో అంచనాలను కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటి చైత్ర జే ఆచార్ కూడా నటించారు. ఈమెకు ఇది రెండవ తమిళ చిత్రం కావడం గమనార్హం. . 2025 మార్చి 5న షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జూలై 4వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.
#3BHK is now streaming on Amazon
Prime in Tamil & Telugu audios.#Siddharth pic.twitter.com/6U83MyxKvs— OTT Gate (@OTTGate) July 31, 2025
Also read:Thammudu OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన నితిన్ తమ్ముడు మూవీ.. ఏ ఏ భాషల్లో చూడొచ్చంటే?