War 2 Collections: ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్ గా నటించిన చిత్రం వార్ 2. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) విలన్ పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి రెండు రోజుల్లోనే రూ.116 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమాకి పోటీగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కూలీ (Coolie ) సినిమా విడుదల అయింది. ఇందులో నాగార్జున (Nagarjuna ), అమీర్ ఖాన్ (Aamir Khan), పూజా హెగ్డే(Pooja Hegde), శృతిహాసన్ (Shruti Haasan), సౌబిన్ షాహిర్ (Soubin shahir) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీపడ్డాయి.
వార్ 2 సినిమా వీకెండ్ కలెక్షన్స్..
ఇదిలా ఉండగా ఈ చిత్రాలకు వీకెండ్ కలిసి వచ్చినా.. అకాల వర్షాల కారణంగా జనాలు పెద్దగా థియేటర్ కి వెళ్లడానికి ఆసక్తి కనబరచలేదు. దీనికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో అనుకోకుండా థియేటర్లలోకి నీళ్లు చొరబడి మార్నింగ్ షోలు కూడా నిలిపివేయబడ్డాయి. మరి ఇన్ని అవాంతరాల మధ్య వార్ 2 సినిమాకి వీకెండ్ కలిసొచ్చిందా? ఎన్ని కోట్లు రాబట్టింది? అసలు బ్రేక్ ఈవెన్ రాబట్టాలి అంటే ఇంకా ఎంత వసూలు చేయాలి..? మరి ఈ సినిమాకి పోటీగా నిలిచిన కూలీ సినిమా కలెక్షన్స్ ను దాటేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే..
వార్ 2 చిత్రానికి రెండు రోజుల్లో రూ.116 కోట్లు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మొదటి వీకెండ్ 4 రోజులు వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 171కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే.. రూ.340 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా రూ.170 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది.. నిజానికి ఈ సినిమాకు పెద్దగా హోప్ లేకపోయినా.. ఎన్టీఆర్ కారణంగానే భారీ హైప్ వచ్చింది. మరి ఇప్పుడున్న ఈ టార్గెట్ ను కంప్లీట్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. లేకపోతే నిర్మాతలకు నష్టం తప్పదు అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ సినిమా వారాంతంలో భారీగా కలెక్షన్స్ వసూల్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆదివారం కూడా ఈ సినిమాకు కలిసి రాకపోవడం దారుణమని చెప్పాలి. ముఖ్యంగా కలెక్షన్లు మాత్రం దారుణంగా పడిపోవడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ:Vijay -Rashmika: ఇప్పటికైనా ఆ గుడ్ న్యూస్ చెప్పేయండబ్బా!