Nani: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇట్టే వైరల్ అవుతోంది. ముఖ్యంగా చిన్న సెలబ్రిటీలను మొదలుకొని పెద్ద పెద్ద స్టార్ హీరో హీరోయిన్ల వరకు ఏదో ఒక సమయంలో ట్రోల్స్ ఎదుర్కొని తీరాల్సిందే. ఏదైనా సమస్యపై మాట్లాడినా.. మాట్లాడకపోయినా అసలు ఏం చేసినా సరే ట్రోల్స్ అనేవి మాత్రం ఆగడం లేదు. అందుకే సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత నోరు విప్పాలంటేనే భయం వేస్తోంది అని చెబుతున్నారు నేచురల్ స్టార్ హీరో నాని (Nani) .
నోరు విప్పాలంటేనే భయం వేస్తోంది – నాని
తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు” కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు నాని. ఇందులో ఎన్నో విషయాలను ఆయన పంచుకున్నారు.. అందులో భాగంగానే సోషల్ మీడియా ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ ఊహించని కామెంట్లు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా నాని మాట్లాడుతూ..” ప్రస్తుతం మంచి, చెడు అనే తేడా లేకుండా పోతోంది. ప్రతి విషయానికి కూడా విమర్శలు వస్తున్నాయి. మనసులో ఉన్న మాటను బయటకు చెప్పాలంటేనే భయం వేస్తోంది. అలా అని చెప్పకుండా ఉండడం మరింత కష్టంగా అనిపిస్తుంది. అందుకే కామెంట్లను పట్టించుకోకుండా మనకు సరైనది.. అనిపించింది చేయాలి. భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే ఈ ట్రోల్స్ నే కాదు ప్రతి దానిని తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే మనం ఒక స్థాయికి చేరుకుంటాము ” అంటూ నాని చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే నాని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పదేళ్ల తర్వాత ఆ బాధ ఉండకూడదు – నాని
ఇక మనసులో మాట చెప్పడంపై కూడా నాని మాట్లాడుతూ.. “ఏదైనా సరే మనం కామెంట్లను పట్టించుకోకుండా మనం చేయగలిగింది చేయాలి. మనకు కరెక్ట్ అనిపించింది మాట్లాడాలి. ఏదేమైనా ఆ రోజు నేను మాట్లాడి ఉండాల్సింది.. మాట్లాడలేకపోయా” అనే బాధ పదేళ్ల తర్వాత ఉండకూడదు అంటూ నాని తెలిపారు.
అందరూ బాగుంటేనే మనం బాగుంటాం- నాని
“మా వాడి సినిమా ఆడాలి.. వేరే వాడి సినిమా ఆడకూడదు.. అని అభిమానులు.. మన సినిమా హిట్ అవ్వాలి.. మరో సినిమా ఫ్లాప్ అవ్వాలి అని ఇండస్ట్రీ వాళ్ళు అంటుంటారు. నేను నా సినిమాలతో పాటు విడుదలయ్యే సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం” అంటూ కూడా తెలిపారు.
అంతలా ఇబ్బంది పెట్టిన అంశం ఏంటబ్బా?
ఇకపోతే నాని ఇలా మాట్లాడ్డానికి కారణం ఏంటి? ఆయనను అంతలా ఇబ్బంది పెట్టిన అంశం ఏమిటి? అనే విషయానికొస్తే 2023లో ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితాలో సూర్య ‘జై భీమ్’ సినిమా లేకపోవడంతో బ్రోకెన్ హార్ట్ ఎమోజిని పోస్ట్ చేశారు నాని. అదే సమయంలో టాలీవుడ్ కి వచ్చిన అవార్డుల గురించి ఆయన ప్రస్తావించకుండా.. కోలీవుడ్ మూవీ గురించి పోస్ట్ పెట్టడంతోనే అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ విషయాలపై ఆయన స్పందించినట్లు తెలుస్తోంది.
also read:Rakul Preet Singh: అయ్యో.. రకుల్ కి ఏమైంది.. మెడపై ఆ స్టిక్కర్ ఏంటి?
#Nani about National award controversy and social media negativity pic.twitter.com/cZNSv3Ij1G
— 𝙀𝙩𝙚𝙧𝙣𝙖𝙡 𝙉𝙖𝙣𝙞 ᵀʰᵉ ᴾᵃʳᵃᵈⁱˢᵉ (@Yashwanth845104) August 30, 2025