Rakul Preet Singh: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేసినప్పటికీ.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే పలు అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. నిత్యం ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టే రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా మెడపై స్టిక్కర్ తో కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటికి ఏమైంది ? అంటూ కంగారు పడుతున్నారు. మరి రకుల్ ప్రీత్ సింగ్ మెడ పై ఉన్న ఆ స్టిక్కర్ ఏంటి? అది ఆమె ఎందుకు ధరించింది? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
రకుల్ మెడపై ఏంటా స్టిక్కర్..?
ఇటీవల ముంబై విమానాశ్రయంలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. అప్పుడు ఆమె మెడపై ఒక స్టిక్కర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రకుల్ మెడ పై ఉన్న స్టిక్కర్ ఏంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు.
ఆ స్టిక్కర్ ఏంటంటే?
ఇక అసలు విషయంలోకి వెళ్తే..రకుల్ మెడ పై ఉన్న స్టిక్కర్ “లైఫ్ వేవ్ ఎక్స్ 39 స్టెమ్ సెల్ ప్యాచ్” అని తెలుస్తోంది. దీనిని ఎందుకు ఉపయోగిస్తారు? అనే విషయానికి వస్తే.. శరీరంలోనే స్టెమ్ సెల్స్ ను ఉత్తేజపరచడానికి రూపొందించిన వెల్నెస్ ప్రొడక్ట్ ఇది. ఈ ప్యాచ్ ఎలాంటి మందులు లేకుండా అటు శక్తిని ఇటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని సమాచారం. ప్రస్తుతం ఇలాంటి స్టిక్కర్స్ ను ఈమధ్య సెలబ్రిటీలు చాలామంది తమ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఖరీదు వేలల్లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో నిత్యం ఆరోగ్యం పై ఫోకస్ పెట్టాలంటే కుదరదని.. అందుకే ఇలాంటి స్టిక్కర్స్ ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తాయని కూడా కొంతమంది సెలబ్రిటీలు చెబుతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరియర్..
‘శ్రీ’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత సందీప్ కిషన్(Sandeep Kishan) తో కలిసి ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమా చేసి.. తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. జయ జానకి నాయిక, సరైనోడు ఇలా చాలా చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. సౌత్ లో కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె.. అక్కడ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నాని (jackey Bhagnani) తో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అందులో భాగంగానే ఇటీవలే ‘మేరీ హస్బెండ్ కి బీవీ’ సినిమాతో ఆడియన్స్ ను పలకరించిన ఈమె.. ఇప్పుడు అజయ్ దేవగన్ తో కలిసి ‘దేదే ప్యార్ దే 2’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆర్.మాధవన్, టబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది.
ALSO READ:Bollywood: చిన్న వయసులోనే కాన్సర్ తో ప్రముఖ నటి మృతి!
?utm_source=ig_web_copy_link