Ganesh Chaturthi Wishes: హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. విఘ్నాలకు అధిపతి, ఆటంకాలను తొలగించే వినాయకుడిని ఈ పండుగ రోజున భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ శుభ సందర్భంలో.. మీ ప్రియమైన వారికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కొన్ని కోట్స్, మెసేజ్‌లు, వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి.
వినాయక చవితి శుభాకాంక్షలకు సంబంధించిన కోట్స్:
“వినాయకుడి ఆశీస్సులతో మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి, సంతోషం, శాంతి, విజయం లభించాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు !”
“వినాయకుడు మీ జీవితంలో వివేకం, శక్తి, ఓర్పు, వెలుగులు నింపాలి. ఈ వినాయక చవితి పండుగ మీ జీవితానికి నూతన ఆరంభం కావాలి. హ్యాపీ గణేష్ చతుర్థి!”
“వినాయకుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి. మీ ఆశయాలు, కోరికలు అన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు !”
“కొత్త పనులు ప్రారంభించే ముందు వినాయకుడిని పూజిస్తే శుభం కలుగుతుంది. ఈ చవితి మీకు కొత్త ప్రయాణాలకు, విజయాలకు నాంది కావాలని కోరుకుంటున్నాను.”
“మీకు , మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోరియా!”
వాట్సాప్ స్టేటస్ కోసం మెసేజ్‌లు:
వినాయకుడి కృపతో మీ కష్టాలు తొలగిపోవాలి, మీ జీవితం ఆనందంతో నిండిపోవాలి.
శుభ వినాయక చవితి !
గణపతి బప్పా మోరియా! ఈ చవితి మీ ఇంటికి సంతోషం, సంపద, ఆరోగ్యం తీసుకురావాలి.
మోదకాలతో వినాయకుడిని ఆహ్వానిద్దాం. ఆయన ఆశీస్సులు మన జీవితంలో నిత్యం ఉండాలి.
వినాయక చవితి శుభాకాంక్షలు!
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి అడుగులో విజయం లభించాలని కోరుకుంటున్నాను.
హ్యాపీ గణేష్ చతుర్థి!
ఈ పవిత్రమైన రోజున, వినాయకుడిని పూజించి, ఆయన దీవెనలతో ఆనందాన్ని పంచుకుందాం.
జై గణేష్!
వినాయకుడిని మట్టితో చేసి, మన మనసును ప్రేమతో నింపుకుందాం. ఈ చవితి మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త విజయాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. హ్యాపీ గణేష్ చతుర్థి!
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడి దీవెనలు మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి, ఆనందాన్ని, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
వినాయకుడు మీ ఇంటికి సంతోషం, సంపద, శాంతిని తీసుకురావాలి. ఈ పండుగ రోజున మీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటూ… శుభ వినాయక చవితి!
ప్రతి పూట మోదకాల రుచి, ప్రతి అడుగులో గణపతి ఆశీస్సులతో మీ జీవితం సంతోషంగా ఉండాలి. హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు.
గణపతి బప్పా మోరియా! వినాయకుడి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ కరిగిపోయి, జీవితం సంతోషంతో నిండిపోవాలి. ఈ చవితిని ఆనందంగా జరుపుకోండి.
మీరు ఆశించే ప్రతి పనీ విజయవంతం కావాలని కోరుకుంటూ, ఈ గణేష్ చతుర్థి మీకు అదృష్టం, విజయం, మంచి ఆరోగ్యం తీసుకురావాలి. హ్యాపీ వినాయక చవితి!
మహాకాయుడు, సూర్యకోటి సమప్రభుడు, నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! ఆ వినాయకుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
వినాయక చవితి పండుగ శుభవేళలో, జ్ఞానం, వివేకాన్ని ప్రసాదించే గణపతిని పూజిద్దాం. ఆయన మీకు తెలివైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ పండుగ రోజున, వినాయకుడిని స్మరిస్తూ.. మీ జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోయి, జ్ఞానజ్యోతి వెలగాలని ఆశిస్తున్నాను. హ్యాపీ గణేష్ చతుర్థి!