Delhi News: కొన్ని సినిమాలు కొందరి వ్యక్తుల రియల్ లైఫ్ మాదిరిగా ఉంటాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. దృశ్యం మూవీని తలపించే ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు భర్త. శవాన్ని పాతిపెట్టి, అసలు డ్రామాకు తెరలేపాడు అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
యూపీలోని అమ్రోహాకు చెందిన 47 ఏళ్ల షాదాబ్ అలీ-ఫాతిమా భార్యభార్తలు. అలీ పెయింటర్ గా జాబ్ చేస్తున్నాడు. మొదట్లో వీరి సంసారం బాగానే సాగింది. కాకపోతే భార్య అందంగా ఉండడంతో మిగతావారు కన్ను తన భార్యపై పడే ఉంటుందని అనుమానం పడేవాడు. ఆమె ఇరుగుపొరుగువారితో సరదాగా ఉండడంతో అనుమానం పెంచుకున్నారు. చివరకు ఆ అనుమానం పెను భూతమైంది.
ఉద్యోగానికి వెళ్లినా పెయింటర్ దృష్టి భార్యపైనే ఉండేది. ఈ క్రమంలో భార్యని చంపాలని డిసైడ్ అయ్యాడు. ఆగష్టు ఒకటిన భార్యకు బలవంతంగా మత్తు మందులు ఇచ్చాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగించాడు. దీంతో పాతిమా చనిపోయింది. భార్య శవాన్ని ఇద్దరు స్నేహితుల సహాయంతో కారులో ఓ శ్మశాన వాటికకు తీసుకెళ్లి పాతిపెట్టాడు.
ఆమె వస్త్రాలను ఓ కాలువలో పడేసి సైలెంట్ గా తన పని చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా షాదాబ్ సొంతూరు అమ్రోహాకు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి అసలు డ్రామా క్రియేట్ చేశాడు. ఫాతిమా ఫోన్ నుంచి తన ఫోన్‌కు మేసెజ్‌లు పెట్టడం మొదలుపెట్టాడు. తాను మరొకర్ని పెళ్లి చేసుకుంటానని, అందుకే వెళ్లి పోతున్నానంటూ అందులో ప్రస్తావించాడు.
ALSO READ: మీటర్ చెక్ చేయాలన్నాడు.. మొత్తం దోచేశాడు
ఇంతరకు అలీ అనుకున్నట్లుగానే సాగింది. అసలు మేటర్ రివర్స్ అయ్యింది. ఆగస్టు 10న ఫాతిమా ఫ్రెండ్ మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఫ్రెండ్ పాతిమా కనిపించలేదని, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. తొలుత సీసీటీవీ ఫుటేజీలో చెక్ చేశారు.
అందులో ఫాతిమా తన భర్త, అతడి ఫ్రెండ్స్‌తో కలిసి అపస్మారక స్థితిలో ఉన్నట్లు కనిపించింది. దాని ఆధారంగా షాదాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో చనిపోయిందని, ఆమె శవాన్ని కాలువలో పడేశానని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు అలీ. చివరకు తమదైన శైలిలో విచారించగా జరిగిన విషయాన్ని పూసగుచ్చి మరీ వివరించాడు.
తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. షాదాబ్ ఇచ్చిన సమాచారంతో శ్మశానంలో ఫాతిమా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. ప్రస్తుతం షాదాబ్ తోపాటు మరో ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. మరొకడి కోసం గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కారుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.