E-Paper
Advertisement

ఢిల్లీ ఘర్షణల వెనుక కుట్ర కోణం ఉందా? నటుడు నరేష్ పోస్ట్ వైరల్

ఢిల్లీ ఘర్షణల వెనుక కుట్ర కోణం ఉందా? నటుడు నరేష్ పోస్ట్ వైరల్
Advertisement

Naresh Comments: గత కొన్ని రోజులుగా దేశాన్ని ఊపేసిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం ఇపుడు ఉదృతంగా మారిపోయింది.ఇక దానికి తోడు అక్కడ జరిగిన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఒక్కసారిగా అక్కడి నిరసన కారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు బారికేడ్లను తోసేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి,లాఠీఛార్జ్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక అక్కడ ఉన్న వాహనాలు కూడా ధ్వంసమవ్వడమే కాకుండా, కొంతమంది పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండపై దీనిపై టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వదిలారు.

నీట్ పేపర్ లీకేజీ అనేది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన చాలా సున్నితమైన అంశమని చెప్పుకొచ్చారు నరేష్ .ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంకాస్త జాగ్రత్తగా, సమర్థవంతంగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, పరీక్షలు పూర్తయి, ఫలితాలు కూడా వచ్చేశాక.. హఠాత్తుగా ఇంత పెద్ద ఎత్తున హింస జరగడం వెనుక ఏదో పెద్ద అనుమానమే ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

Advertisement

దేశాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా ఉందా

తమ బాధ్యతగా డ్యూటీ చేస్తున్న పోలీసులు గాయపడటం చూస్తే బాధగా ఉందన్న ఆయన, ఈ ఘర్షణల వెనుక దేశాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం శాంతియుతంగా నిరసన తెలపడం ఎవరికైనా ఓకే అని, కానీ ఆ పేరుతో యువతను తప్పుదోవ పట్టించి హింసను ప్రేరేపిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

సినిమాల విషయానికి వస్తే

నటుడిగా దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తున్న నరేష్ అడపా దడపా సొసైటీలో జరుగుతున్న సంఘటనలపై తనదైన శైలిలో కామెంట్స్ ఓపెన్ గా చేయడం మనం చూస్తూనే ఉంటాం.ఇక నరేష్ సినిమాల విషయానికి వస్తే 1970లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984), ‘చిత్రం భళారే విచిత్రం’ (1991), ‘జంబలకిడిపంబ’ (1993) వంటి హిట్ సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తనదైన నటనతో అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య ‘సమ్మోహనం’ (2018), ‘అంటే సుందరానికి!’ (2022),నారీ నారీ నడుమ మురారి(2026) చిత్రాల్లో ఆయన నటనకు ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ దక్కింది.

ఇక చూస్తుంటే నరేష్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు పెద్ద చర్చకే దారి తీసేలా ఉన్నాయి. కొంతమంది ఆయనకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు నిరసనకారుల తరఫున మాట్లాడుతున్నారు. ఏదేమైనా, దేశ ప్రయోజనాలే ముఖ్యమని, హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేష్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.చూడాలి ముందు ముందు ఈ కామెంట్స్ పై ఎవరైనా సెలెబ్రెటీలు రియాక్ట్ అవుతారో !

Related News

దేవుళ్లతో విజయ్, త్రిష పోలికా? రచ్చ ఎక్కిన ఫ్లెక్సీ వివాదం!

చీరకట్టు.. సిగరెట్.. మద్యం! ఆ ఇమేజ్ నుంచి బయటపడిన బాలీవుడ్ బ్యూటీ !

డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణం తీరని లోటు..

శ్రద్దా కపూర్ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..? మూవీ కన్నా అక్కడే ఎక్కువ..

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. నటి కేలి హాటిల్ కన్నుమూత..

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

Big Stories

Advertisement
×