E-Paper
Advertisement

అమరవీరుల కాలనీ ఫామ్‌హౌజ్‌ దగ్గర ఎందుకు? ఉద్యమకారులకు కూడా మియాపూర్‌లో జాగాలివ్వండి! కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ బూమరాంగ్‌!

అమరవీరుల కాలనీ ఫామ్‌హౌజ్‌ దగ్గర ఎందుకు? ఉద్యమకారులకు కూడా మియాపూర్‌లో జాగాలివ్వండి! కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ బూమరాంగ్‌!
Advertisement

పాపం.. కేటీఆర్‌ ఏమి మాట్లాడాలనుకున్నా.. అది బూమరాంగే అయి కూర్చుంటున్నది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఏదో అనబోతాడు. అది తనకే రివర్స్‌లో తాకుతున్నది. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. తాజాగా ఆయన మియాపూర్‌ భూముల విషయంలో మాట్లాడి మళ్లీ దొరికిపోయాడు. ఈసారి ఉద్యమకారుల ఇష్యూ తీసి అది తన నెత్తిమీదకే తెచ్చుకున్నాడు. అసలేం మట్లాడాడో.. దాని పర్యవసానాలేమిటో చూద్దాం.

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభత్వానిదేనని సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. వీటిని అమ్మి సంక్షేమం, అభివృద్ది, విద్యకు కేటాయిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు తాజాగా ఓ మీటింగులో. మొదట కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ ఉదంతాన్ని తీసుకున్నాడు. అక్కడెక్కడో 75కి.మీ దూరంలో ఉన్న ఎర్రవల్లి అమర వీరుల కాలనీ కడుతానంటున్నారు. అంత దూరమెందుకు? ఇక్కడ మియాపూర్‌లో కట్టండి…. ఓ 100 ఎకరాల్లో బ్రహ్మాండంగా వారికి జాగాలు ఇవ్వొచ్చుగా! అని ఉచిత సలహా ఇచ్చాడు కేటీఆర్‌.

Advertisement

ఆ ఫామ్‌హౌజ్‌ వద్ద అమర వీరుల కాలనీ అంశం బీఆరెస్‌కు నెగిటివిటీనే తెచ్చిపెడుతోంది. ఇది సరిపోదంటూ కేటీఆర్‌ నోటి వెంట ఇలా ఉచిత సలహా ఇచ్చి ఆ వివాదానికి మరింతగా ఆజ్యం పోశాడనే కామెంట్సే వస్తున్నాయి.  ‘ఉద్యమకారులకు ఇస్తానన్న 275 గజాల ప్రభుత్వ జాగా హామీ ఇచ్చావు కదా? అవి కూడా ఆ మియాపూర్‌ భూముల్లో ఇవ్వు. బాగుంటుంది కదా! ఎందుకు వాటిని అమ్మేయడం.. ‘ అని ఉచిత సలహాకు తోడు సీఎంకు చురకలంటిద్దామనే వ్యూహాన్ని ప్రదర్శించాలనుకున్నాడు కేటీఆర్‌. కానీ ఇది బూమరాంగే అయ్యింది.

ఎందుకంటే, ఉద్యమకారుల ఇష్యూను బీఆర్‌ఎస్‌ ఎత్తుకుంటే చాలు భగ్గుమంటున్నారు వాళ్లు. ఆర్థికంగా, కుటుంబ పరంగా చితికిపోయిన తమను కేసీఆర్ పట్టించుకోలేదని, ప్రాణాలు లెక్క చేయకుండా ఉద్యమాలు చేసిన తమను పదేళ్లకాలంలో పదవుల మాటేమో గానీ, మర్యాద కూడా దక్కలేదనే కోపం, అసంతృప్తి ఇంకా ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యమకారులకు అక్కడ జాగా ఇవ్వండి.. ఇక్కడ జాగా ఇవ్వండి!అని కేటీఆర్ నోటి వెంట ఉచిత సలహా విన్న తరువాత ఉద్యమకారులు కడుపు మండిపోతున్నది.

Advertisement

‘మరి మీరెందుకు ఆనాడు ఇవ్వలేకపోయారు?’ అని ఉల్టా బీఆర్‌ఎస్‌నే నిలదీసే పరిస్థితులను కొని తెచ్చుకున్నట్టైంది కేటీఆర్‌కు. తండ్రి ఫామ్‌హౌజ్‌ వద్ద అమరవీరుల కాలనీ కడుదామనే రేవంత్‌ వ్యూహాన్ని తిప్పికొడదామనుకుంటే అది ఉల్టా తిరిగింది. ఉద్యమకారులకు మద్దతుగా మాట్లాడదామని అనుకున్నా..ఆ మాటలు కూడా తిరిగి తననే తాకుతున్నాయి. కేటీఆర్‌ ఏ వేదిక ఎక్కి ఏం మాట్లాడినా.. అందులో తనకు తగిలే అస్త్రాలనే సంధించుకుంటున్నాడు. తాజాగా ఈ ఉద్యమకారుల ఇష్యూ కూడా వచ్చి చేరిందిప్పుడు.

Tags

Related News

ఏడాది తరువాత కోదండరామ్‌కు టైం ఇచ్చిన సీఎం! కలిసిన టీజేఎస్ ప్రతినిధులు! కరువు నేపథ్యంపై ప్రొఫెసర్‌ కీలక చర్చలు!

కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ…! ఈ రాష్ట్రాల్లో జనాలకు సీఎంలు భయపడాల్సిందే.. జవాబుదారీ పాలన అందివ్వాల్సిందే!

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌రావుకు ‘ఫ్రీ హ్యాండ్.. ఎందుకో తెలుసా..?

మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?

ఖైరతాబాద్ ఉపఎన్నిక సస్పెన్స్.. దానం నాగేందర్ వర్సెస్ పి. విజయారెడ్డి న్యాయపోరాటంలో గెలుపెవరిది?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కమలం గట్టి ఫోకస్.. కారణం బీజేపీ అసలు ప్లాన్ ఇదే?

ఉమ్మడి మెదక్ జిల్లా పదవుల్లో.. పక్క జిల్లా ఎమ్మెల్యే పైరవీలు..?

Big Stories

Advertisement
×