BigTV English

Jabardasth Dorababu: ఏంటీ.. మెగా బ్రదర్స్ ఇలాంటివారా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన దొరబాబు!

Jabardasth Dorababu: ఏంటీ.. మెగా బ్రదర్స్ ఇలాంటివారా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన దొరబాబు!

Jabardasth Dorababu: జబర్దస్త్(Jabardasth) ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా చాలామంది తమలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టి కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి యాంకర్లుగా, యాక్టర్లుగా, డైరెక్టర్లుగా, రైటర్లుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్(Sudigali Sudheer),గెటప్ శ్రీను (Getup Srinu)లు హీరోలుగా మారితే..వేణు యెల్దండి(Venu Yeldandi) ‘బలగం’ సినిమా తీసి డైరెక్టర్ గా మారారు. అలా కమెడియన్ గా వచ్చిన వాళ్ళు అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారంటే దానంతటకీ కారణం జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీ అనే చెప్పుకోవచ్చు.అయితే అలాంటి జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో దొరబాబు (Dorababu ) కూడా ఒకరు.. హైపర్ ఆది (Hyper Aadi) టీంలో కొనసాగుతున్న దొరబాబు తాజాగా మెగా ఫ్యామిలీ అన్నదమ్ముల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. మరి ఇంతకీ మెగా ఫ్యామిలీ (Mega Family) గురించి దొరబాబు ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.


చిరు బ్లడ్ బ్యాంకుకి దొరబాబు రక్తదానం..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్డే ఈ నెలలో రాబోతోంది. ఆగస్టు 22న బర్త్డే కావడంతో ఇప్పటినుండే అభిమానులు ఆయన బర్త్డేకి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలనే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక చిరంజీవి బర్త్డేకి చాలామంది ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి రక్తదానం చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రక్తదానం గురించి, మెగా ఫ్యామిలీ గురించి జబర్దస్త్ కమెడియన్ దొరబాబు (Dora Babu)ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఇప్పటికే 6సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్ చేశాను.అయితే కొంతమంది 100 సార్లు రక్తదానం చేశామని చెప్పారు.ఆ టైంలో నేను వాళ్లసలు బ్లడ్ అనుకుంటున్నారా..
వాటర్ ప్యాకెట్లు అనుకుంటున్నారా? అలా చేస్తున్నారని షాక్ అయ్యే వాడిని.కానీ బ్లడ్ డొనేట్ చేస్తే మంచిదనే విషయం నాకు తెలియదు.


గుర్తుపెట్టుకొని మరీ పలకరించారు – దొరబాబు

ఇక చిరంజీవి విషయానికి వస్తే..ఆయన ప్రతిరోజు జబర్దస్త్ చూస్తారట. అంతేకాదు జబర్దస్త్ లో ఉన్న కమెడియన్లందరి పేర్లు ఆయనకు తెలుసు. ఓ సారీ చిరంజీవి బర్త్డే సందర్భంగా జబర్దస్త్ టీం (Jabardasth Team) మొత్తం ఆయన ఇంటికి వెళ్లారు. ఆ టైంలో ఆది అన్నతో నేను కూడా వస్తానని చెప్పాను. అలా వెళ్ళిన సమయంలో చాలామంది గెస్ట్లు వచ్చారు.వారితో మాట్లాడుతున్న సమయంలో మమ్మల్ని చూసి ఆయనే మా దగ్గరికి వచ్చి పలకరించారు.
మా అందరి పేర్లు గుర్తు పెట్టుకొని మాట్లాడారు.

సెల్ఫీ అడిగితే.. చిరంజీవి అలా చేస్తారనుకోలేదు – జబర్దస్త్ దొరబాబు..

అయితే నేను చిన్నప్పటి నుండే చిరంజీవికి వీరాభిమానిని కావడంతో ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అలా ఆయన మళ్ళీ కలుస్తానని వెళ్తున్న టైంలో ఆయన వెనకే సెల్ఫీ కోసం వెళ్లాను. కానీ కొంతమంది నన్ను వెనక్కి లాగారు. అలా ఆయన సడన్గా టర్న్ అవ్వడంతో ఆయన మొహం ముందే నేను ఉన్నాను.ఏంటి అని అడిగితే ఒక సెల్ఫీ కావాలి సార్ అనడంతో ఆయన ఇచ్చారు. ఆ టైంలో చిన్నప్పటినుండి అభిమానిస్తున్న హీరోని దగ్గర నుండి చూడడంతో నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అలా ఆయన మీద చేయి కూడా వేశాను. ఆ టైంలో కొంతమంది నా చేయి లాగారు. అయినా కూడా పర్వాలేదని ఆయన చెప్పారు.అయితే ఆ టైంలో నేను వేరే మైకంలోకి వెళ్ళిపోయాను. సెల్ఫీ తీసుకోవడమే నా ప్రధాన ధ్యేయం.అలా నా కల నెరవేర్చుకున్నాను. నిజానికి చిరంజీవి అంత గొప్పగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు.. ఆ తర్వాత మరోసారి కూడా ఆయన్ని కలిసాను అంటూ దొరబాబు చెప్పుకొచ్చారు.

వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నాను – దొరబాబు

అలాగే పవన్ కళ్యాణ్, నాగబాబుల గురించి చెబుతూ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టైంలో ఆయనకు మద్దతుగా మేం వెళ్ళాము. కానీ ఆ సమయంలో వేరే పార్టీ ప్రభావం ఉండడంతో ఆయన గెలవలేదు.కానీ ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో కూడా మేము క్యాన్వసింగ్ కి వెళ్లి ఓ 10 రోజుల పాటు పవన్ అన్న తరపున ప్రచారం చేశాము. ఇక నాగబాబు (Nagababu) విషయానికి వస్తే ఆయన నా దేవుడు. నా ఫోన్లో కూడా మై గాడ్ అనే ఆయన నెంబర్ సేవ్ చేసుకున్నాను. ఆయన ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తారు. ఆయన ప్రోత్సాహం వల్లే మేము ఇంతలా ఎదిగాం. ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేం అంటూ జబర్దస్త్ కమెడియన్ దొరబాబు మెగా ఫ్యామిలీ లోని ముగ్గురు అన్నదమ్ముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు.మొత్తానికి దొరబాబు కామెంట్స్ తో మెగా బ్రదర్స్ పై కామెంట్స్ చేసే యాంటీ ఫ్యాన్స్ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

Also read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి క్రేజీ అప్డేట్.. ఫాన్స్ కి ఇది కదా కావాల్సింది!

Related News

Star Maa Parivaaram Promo: శ్రీముఖికి దిమ్మతిరిగే కౌంటర్.. పెళ్లి కావ్య షాకింగ్ రియాక్షన్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంటికి దొంగగా వచ్చిన ఆనందారావు.. ధీరజ్ కు దొరికిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవనిని గేంటేసిన పార్వతి.. భరత్, ప్రణతిలను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్.. భానుమతికి వాతలు..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. పూజను పూర్తి చేసిన రోహిణి.. బాలు సెటైర్లు.. మనోజ్ కు కడుపు మంట..

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఎమోషనల్‌ అయిన ఇంద్రాదేవి  

Big Stories

×