BigTV English

Kavitha: కాలం కలిసొచ్చింది.. కవిత దీక్ష విరమణ, తర్వాత ప్లాన్

Kavitha: కాలం కలిసొచ్చింది.. కవిత దీక్ష విరమణ, తర్వాత ప్లాన్

Kavitha: ఎమ్మెల్సీ కవితకు కాలం కలిసొచ్చిందా? నిరాహార దీక్ష ద్వారా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేయాలని భావించారా? బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించాలని ప్లాన్ చేశారా? మనం ఒకటి తలస్తే.. దైవం మరొకటి తలచిందా? ఏది జరిగినా మన మంచికేనని ఆమె భావిస్తున్నారా? కవిత తర్వాత అడుగులు ఎలా ఉండనున్నాయి? ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఇదే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్‌లో శ్రేణుల్లో మొదలైంది.


బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష సోమవారం ఉదయం నిరాహార దీక్షకు దిగారు. ఆమె దీక్షని డైవర్ట్ చేసేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీయాగానికి ఏర్పాటు చేశారు. తండ్రి-కూతురు తలపెట్టిన రెండు కార్యక్రమాలు చివరకు మిడిల్ డ్రాపయ్యాయి.

సాయంత్రం 5 గంటల వరకు కవిత నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో 72 గంటల పాటు దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.


ధర్నా చౌక్‌ను నిరసన కోసం ఉపయోగించుకునేందుకు అనుమతి నిరాకరించడంతో సాయంత్రం కవిత నిరాహార దీక్షను విరమించాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కవితకు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ప్రజల అటెంక్షన్ అటువైపు ఉంది.

ALSO READ: జేబీఎస్ మారుతుంది.. ఇప్పుడు ప్రయాణం కొత్తగా

ఇలాంటి సమయంలో కవిత దీక్షకు దిగినా ఊహించిన మైలేజీ రాదని అంటున్నారు. సరైన సమయంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందన్నది జాగృతి కార్యకర్తల మాట. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్-బీజేపీ పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జాగృతి-యునైటెడ్ ఫూలే ఫ్రంట్ బలమైన వ్యూహంతో తిరిగి వస్తాయని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

ఇటీవల కవిత చేసిన దీక్షలకు ఆ పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దీనికితోడు సోమవారం సాయంత్రం భారీ వర్షం రావడం కవితకు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు.  మరోవైపు కవిత దీక్షపై అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడిపోయాయి.

గడిచిన పదేళ్లు ఈ అంశంపై ఎందుకు ఆమె సైలెంట్‌గా ఉన్నారని, ఇప్పుడే బీసీలకు గుర్తుకు వచ్చారా అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం నివేదిక పుణ్యమానికి కవిత రిలీఫ్ వచ్చిందని అంటున్నారు. మళ్లీ దీక్షకు కవిత ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి.

Related News

Hyderabad Skywalk: హైదరాబాద్‌లో మరో రెండు స్కైవాక్ లు.. ఈ ఏరియాల్లో ప్రజల కష్టాలు తీరినట్లే!

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్ టీ తప్పుకోలేదు.. ఇది కేసీఆర్ కుట్ర, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Fake doctors: హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్.. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం.. చివరకు?

KTR Elevations: ఇదేం ఎలివేషన్ సామీ? ఓజీ సినిమాపై కేటీఆర్ కి అంత మోజుందా?

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువవైన గంజాయి పట్టివేత

Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్.. బీఆర్ఎస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో బాంబు పేల్చనున్న కవిత?

Income Tax Raids: నాలుగో రోజు క్యాప్స్‌ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Big Stories

×