Tollywood Heroine : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలను అనుభవించి కన్నీళ్లను దిగమింగుకొని ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. తన నటన ప్రతిభతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే ఈయన స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నటుడు. ఈయన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాగే ఈయనతో ఇప్పటికీ సినిమాలు చేసేందుకు కుర్ర హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు. అలాంటి మెగాస్టార్ ని ఓ హీరోయిన్ దారుణంగా అవమానించిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మెగాస్టార్ కు అవమానం..
మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఇందులో హీరోయిన్ మాధవి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయన్ను తీవ్రంగా అవమానించిందట.. మాధవి అప్పటికే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ అయిపోయాక వీరిద్దరికీ వేర్వేరు హోటల్స్ లో స్టే చేసేందుకు ఏర్పాటు చేశారట. తర్వాత రోజు షూటింగ్ లొకేషన్స్ కు రావాలని నిర్మాత తన కారును పంపించారట. ముందుగా కారు హీరోయిన్ మాధవి ఉండే హోటల్ కి వెళ్లి తీసుకువచ్చారు.. ఆ తర్వాత చిరంజీవిని కూడా పిక్ చేసుకోవడానికి కారు వచ్చింది. చిరంజీవి కారులో మాధవి పక్కన కూర్చున్నాడట..వెంటనే మాధవి మీరు నా పక్కన వద్దు ముందుకు వెళ్లి కూర్చోండి అందట.
అలా ప్రతిరోజు మాధవి వెనక సీట్లో కూర్చుంటే చిరంజీవి ముందు సీట్లో కూర్చునేవారట. చిన్న హీరోను కాబట్టే నా పక్కన కూర్చోడానికి ఆమె నామోషీగా ఫీల్ అయింది ఎలాగైనా సరే స్టార్ హీరోని అయి చూపించాలి అని చిరు పట్టుదలతో సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని చిరంజీవి బయట పెట్టారు. ఎవరైనా అవమానాలు జరిగితే దాచుకుంటారు కానీ మెగాస్టార్ మాత్రం తనకు తగిలిన ఎదురుదెబ్బలను అవమానాలని బయటపెట్టి ఎలా సక్సెస్ అయ్యాడో చెప్తూ ఉంటాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి దొరకడం అదృష్టం అని మెగా ఫాన్స్ అంటున్నారు.
Also Read :హీరో సూర్య గొప్పతనం.. 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లు..
సినిమాల విషయానికొస్తే..
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈమధ్య వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది..