కన్ఫార్మ్ టికెట్లను పొందలేని వారికి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడమే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మార్గాల్లో రిజర్వేషన్ లేకుండానే ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో సీట్లు లభించక చాలా మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం సౌకర్యవంతమైన, స్వల్ప దూర ప్రయాణాన్ని ఇష్టపడే ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజా రైల్వే నిర్ణయం ప్రకారం ప్రయాణీకులు ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం లేకుండా నిర్దిష్ట రైళ్లలో జనరల్, అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించవచ్చు. అయితే, ఈ సౌకర్యం అన్ని రైళ్లకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎక్కే ముందు వారి రైలు రిజర్వ్ చేయని కేటగిరీలో ఉందో? లేదో? చెక్ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే. ఈ అవకాశం లేని రైళ్లలోకి ఎక్కడితే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.
తక్కువ దూరం ప్రయాణించే వారికి అనుగణంగా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ ప్రయాణికులకు అనుగుణంగా ఉండేలా చర్యలు చేపట్టింది. రిజర్వేషన్ లేని ప్రయాణాన్ని అందించే రైళ్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ముంబై-పుణే సూపర్ ఫాస్ట్ రైలు: ఈ రైలు ముంబై నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరి ఉదయం 11:00 గంటలకు పూణే చేరుకుంటుంది. దాదాపు 3.5 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
⦿ హైదరాబాద్-విజయవాడ ఎక్స్ ప్రెస్: హైదరాబాద్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
⦿ ఢిల్లీ-జైపూర్ ఎక్స్ ప్రెస్: ఢిల్లీ నుంచి ఉదయం 6:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు జైపూర్ చేరుకుంటుంది.
⦿ లక్నో-వారణాసి ఎక్స్ ప్రెస్: లక్నో నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు వారణాసి చేరుకుంటుంది.
⦿ కోల్ కతా-పాట్నా ఇంటర్ సిటీ: కోల్‌కతా నుంచి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:00 గంటలకు పాట్నా చేరుకుంటుంది.
⦿ అహ్మదాబాద్–సూరత్ సూపర్ ఫాస్ట్ రైలు: ఈ రైలు ఉదయం 7:00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12:30 వరకు సూరత్ చేరుకుంటుంది.
⦿ పాట్నా–గయా ఎక్స్ ప్రెస్: ఈ రైలు ఉదయం 6:00 గంటలకు పాట్నా నుంచి బయల్దేరి ఉదయం 9:30 గంటలకు గయా చేరుకుంటుంది.
⦿ జైపూర్–అజ్మీర్ సూపర్ ఫాస్ట్ రైలు: ఈ రైలు ఉదయం 8:00 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి ఉదయం 11:30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది.
⦿ చెన్నై–బెంగళూరు ఎక్స్ ప్రెస్: ఈ రైలు ఉదయం 8:00 గంటలకు చెన్నై నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
⦿ భోపాల్–ఇండోర్ ఇంటర్ సిటీ: ఈ రైలు ఉదయం 6:30 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:00 గంటలకు ఇండోర్ కు చేరుకుంటుంది.
భారతీయ రైల్వే ఈ సర్వీసులకు సంబంధించి ప్రత్యేక ఛార్జీల వివరాలను విడుదల చేసింది.
⦿ ఢిల్లీ–జైపూర్ ఎక్స్ ప్రెస్: రూ.150 (జనరల్), రూ.300 (సిట్టింగ్ కోచ్)
⦿ ముంబై–పుణే సూపర్ ఫాస్ట్: రూ.120 (జనరల్), రూ.250 (సిట్టింగ్ కోచ్)
⦿ కోల్ కతా–పాట్నా ఇంటర్ సిటీ: రూ. 200 (జనరల్), రూ. 400 (సిట్టింగ్ కోచ్)
రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది ప్రయాణీకులకు, ముఖ్యంగా రోజువారీ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also: రైల్లో టాయిలెట్‌నే బెడ్ రూమ్‌గా మార్చేసుకొని ప్రయాణం, అట్లుంటది మనతోటి!