Fire Storm Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఓజీ సినిమా(OG Movie) నుంచి బిగ్ అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ (Sujeeth)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. “ఫైర్ స్టార్మ్ సాంగ్”(Fire Storm Song) అంటూ సాగే ఈ పాటలో అద్భుతమైన లిరిక్స్ జోడించారని చెప్పాలి. “అలలిక కడలిక భయపడలే” అంటూ పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేస్తూ సాగే ఈ పాట అభిమానులకు గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ పాట విడుదల చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ పాటకు తమన్(Thaman) అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu) ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.
మళ్లీ దొరికిపోయిన తమన్..
తాజాగా ఈ పాట విడుదల చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తమన్ కు సంబంధించి ఏ సినిమా నుంచి పాటలు విడుదలైన వెంటనే కాపీ అంటూ ఈయనపై ట్రోల్స్ రావడం జరుగుతుంది. తాజాగా ఓజీ సాంగ్ విషయంలో కూడా ఈయనకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఈ పాట విడుదలై గంట వ్యవధి కూడా కాకుండానే ఈయనపై కాపీ క్యాట్ అంటూ విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి.
బేబీ జాన్ సినిమా నుంచి కాపీ..
తాజాగా ఓజీ నుంచి విడుదల చేసిన “ఫైర్ స్టార్మ్ సాంగ్” పాట బేబీ జాన్ (Baby John)సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ కూడా ఈ వీడియో పై స్పందిస్తూ.. సాంగ్ ఏదైనా విడుదలైన కొద్ది క్షణాలకే దొరికిపోవడం తమన్ స్టైల్ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోని పవన్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ జాన్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు.
Baby John Remix kotadu 😂 pic.twitter.com/SuwGmgNvTt
— VISHU🐉 (@JrVishu9) August 2, 2025
ఇక ఈ సినిమా కూడా అట్లీ దర్శకత్వంలో తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేరి సినిమాకు రీమేక్ సినిమా. అయితే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ సోర్స్ తమన్ కాపీ కొట్టారు అంటూ మరోసారి ఈయనపై కాపీ క్యాట్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. మరి ఈ ట్రోల్స్ పై తమన్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఓజి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Also Read: Vijay Devarakonda: అర్జున్ రెడ్డికి అదే ఎక్కువ… రెమ్యూనరేషన్ పై ఓపెన్ అయిన విజయ్!