Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఒకరు. తాజాగా ఈయన కింగ్డమ్(King dom) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడు సంవత్సరాలు పాటు సరైన హిట్ లేక సతమతమవుతున్న ఈయనకు కింగ్డమ్ సినిమా కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పాలి.
సంచలనాలను సృష్టించిన అర్జున్ రెడ్డి…
ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన తన గత సినిమాల గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా గురించి కూడా మాట్లాడారు. విజయ్ దేవరకొండ అంటేనే టక్కున అందరికీ అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా సంచలనాలను సృష్టించిందని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
అప్పుడు అదే ఎక్కువ…
ఇక ఈ సినిమాలో నటించిన తర్వాత విజయ్ దేవరకొండ కెరియర్ పూర్తిగా మలుపు తిరిగిందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration) గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన సినీ కెరియర్ లో మంచి సక్సెస్ అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా కోసం తాను రూ.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు. అయితే ఆ సమయంలో నాకు ఇది చాలా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అని గుర్తు చేసుకున్నారు. ఇక కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ సుమారు 30 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
స్పై యాక్షన్ డ్రామాగా…
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామగా కింగ్డమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈయన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాతో పాటు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండకు హిట్ పడడంతో అభిమానులు కూడా సంతోషంలో ఉన్నారు.
Also Read: TV Actress Mother Death: శోక సంద్రంలో బుల్లితెర నటి.. శుభవార్త చెప్పిందో లేదో అప్పుడే విషాదం!