BigTV English

Samantha – Naga Chaitanya :నాగచైతన్యకి రాఖీ కట్టిన సమంత.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Samantha – Naga Chaitanya :నాగచైతన్యకి రాఖీ కట్టిన సమంత.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Samantha – Naga Chaitanya :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ కపుల్ గా పేరు సొంతం చేసుకున్నారు నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha).’ఏ మాయ చేసావే’ సినిమాలో జంటగా నటించి.. అక్కడే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయగా.. ఇక 2017లో పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట.. అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) తో ప్రేమలో పడి గత ఏడాది పెళ్లి చేసుకున్నారు.


వైరల్ గా మారిన నాగచైతన్య – సమంత వీడియో..

అయితే సమంత మాత్రం నాగచైతన్యను టార్గెట్ చేస్తూ పరోక్షంగా ఆయన పరువు తీసే ప్రయత్నం చేస్తోందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు రక్షాబంధన్.. ప్రపంచవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు , అక్క తమ్ముళ్లు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఈ రక్షాబంధన్ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సమంత.. నాగచైతన్యకు రాఖీ కట్టినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


నాగచైతన్య కి కన్నీళ్ళతో రాఖీ కట్టిన సమంత..

అసలు విషయంలోకి వెళ్తే.. ఒక వీడియోలో సమంత కన్నీళ్ళతో నాగచైతన్య కి రాఖీ కడుతోంది. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. మరి ఈ వైరల్ వీడియో పై ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫేక్ వీడియోని క్రియోట్ చేశారు. ఆ వీడియోలో సమంత ఏడుస్తూ.. నాగ చైతన్యకి రాఖీ కడుతోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై మండిపడుతూ.. రక్షాబంధన్ అనేది ఒక సాంప్రదాయ పండుగ. దానిని మీ ఆనందం కోసం ఇలా టెక్నాలజీని ఉపయోగించి విలువలు కోల్పోయేలా చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి అయితే టెక్నాలజీ కారణంగా ఏవేవో చేసేస్తూ వ్యక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

నాగచైతన్య కి రాఖీ కడతానని బెదిరించిన సమంత..

ఇకపోతే నాగచైతన్యకి రాఖీ కడతానని సమంత గతంలోనే బెదిరించిందట. ఈ విషయాన్ని నాగచైతన్య స్వయంగా వెల్లడించడం ఇక్కడ ఆశ్చర్యంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. 2017లో వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకుల తర్వాత వీరిద్దరికీ సంబంధించిన పాత విషయాలు బయటపడ్డాయి. అందులో భాగంగానే ఆ పాత వీడియోలో లవ్ మ్యాటర్ గురించి తల్లిదండ్రులకు చెప్పాలి అని , అలా చెప్పకపోతే రాఖీ కట్టేస్తానని సమంత తనను బెదిరించింది అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.. ఆ తర్వాతే ఇంట్లో చెప్పి వివాహం చేసుకున్నామని కూడా నాగచైతన్య తెలిపారు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిజంగానే సమంత, నాగచైతన్యకు రాఖీ కట్టినట్టు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వీడియో క్రియేట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అటు నాగ చైతన్య అభిమానులు ఇటు సమంత అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Disco Shanti: 28 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో భార్య.. ఇప్పుడైనా కలిసొస్తుందా?

Related News

Udaipur files: వివాదాల నడుమ థియేటర్ లోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్.. ఎలా ఉందంటే?

Mega Heroes: ఒకే ప్రేమ్ లో మెగా హీరోస్.. ట్రెండింగ్ లో పెద్ది మూవీ!

Arundhati: పెళ్లికి సిద్ధమైన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ!

Ajith -Shalini: నా హృదయాన్ని కరిగించావ్.. అజిత్ కాళ్ళు మొక్కిన షాలిని..

Kiara Advani: నేను డైపర్లు మారిస్తే.. నువ్వేమో.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కియారా!

Coolie Film: సింగపూర్ లో కూలీ హవా.. పవర్ హౌస్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్!

Big Stories

×