భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత వేగం అందుకుంటుంది. ఇప్పటికే వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఇండియన్ రైల్వే త్వరలో లక్నో నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్ రైల్వే మరికొద్ది రోజుల్లో మొదలుకాబోతోంది. అయితే, రైల్వే బోర్డు నుండి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఉత్తర, ఉత్తర మధ్య రైల్వే పరిధిలో నడిచే లక్నో-ముంబై వందేభారత్ స్లీపర్ రైలు కు సంబంధించి త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైలును ఉత్తర మధ్య రైల్వేలోని ఆగ్రా డివిజన్ నిర్వహిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ రైలు లక్నో నుంచి ముంబైకి ప్రయాణించడానికి దాదాపు 12 గంటలు పడుతుంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైలును నార్త్ సెంట్రల్ రైల్వేలోని ఆగ్రా డివిజన్ నిర్వహిస్తుంది. ఈ రైలు లక్నో నుండి ముంబైకి ప్రయాణించడానికి దాదాపు 12 గంటలు పడుతుంది. భోపాల్, జైపూర్, ఆగ్రా వంటి ప్రధాన నగరాల మీదుగా లక్నోకు వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని రైల్వే ప్రణాళికలు చేస్తోంది.
అటు అమౌసి యార్డ్ లో పనులు జరుగుతున్నందున, అక్టోబర్ 8, 9 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
⦿ అక్టోబర్ 8న రైలు నెంబర్ 11109 ఝాన్సీ-లక్నో, 22453 రాజధాని రాణి, 12180/12179 లక్నో-ఆగ్రా, 51813/51814 లక్నో- ఝాన్సీ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
⦿ అక్టోబర్ 9న రైలు నెంబర్ 11110 లక్నో-ఝాన్సీ, 22454 రాజధాని రాణి రైళ్లు రద్దు చేయబడతాయి.
Read Also: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!
అటు ఈ పనుల కారణంగా పలు రైళ్లు అమౌసి స్టేషన్‌లో ఆగవని అధికారులు తెలిపారు.
⦿ అక్టోబర్ 8, 9 తేదీల్లో 55346 కాస్ గంజ్- లక్నో ప్యాసింజర్, 64204 కాన్పూర్ సెంట్రల్-ఝాన్సీ జంక్షన్, 64212 కాన్పూర్ సెంట్రల్-ఝాన్సీ జంక్షన్, 64214 కాన్పూర్ సెంట్రల్-ఝాన్సీ MEMU అమౌసి స్టేషన్‌లో ఆగవని అధికారులు తెలిపారు.
⦿ అటు అక్టోబర్ 9న, రైలు నెంబర్ 51813 ఝాన్సీ-లక్నో ప్యాసింజర్ అమౌసి స్టేషన్‌లో ఆగదు.
⦿ అక్టోబర్ 8న రైలు నెంబర్ 12004 శతాబ్ది, అక్టోబర్ 7న పూణే-ఝాన్సీ, 19715 జైపూర్-గోమతినగర్, 15066 పన్వేల్-గోరఖ్‌పూర్, అక్టోబర్ 6న 12592 యశ్వంత్‌పూర్-ఝాన్సీ రైళ్లు ఆల్టర్నేటివ్ దారుల్లో నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు రైళ్లలో మార్పుల గురించి తెలుసుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Read Also: కుండపోత వర్షాలతో పలు రైళ్లు రద్దు.. మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!