Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అల్లు అర్జున్(Allu Arjun). అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు అయితే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో ఈయన నటించిన పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
రప్పా .. రప్పా …
పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం అట్లీ(Atlee) డైరెక్షన్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా ఇటీవల అల్లు అర్జున్ కి సంబంధించిన రప్పా .. రప్పా (Rappaa.. Rappa)అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ డైలాగు మారుమోగిపోతుంది.
అందం కోసం సర్జరీలు..
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్లు అల్లు అర్జున్ ఫోటోపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అలా అందంగా కనిపిస్తేనే వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రీలో వారికి కెరియర్ అనేది ఉంటుంది. ఇక చిన్నప్పుడు ముఖ కవళికలు బాగా లేకపోయినా హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు సర్జరీలు చేయించుకున్న విషయం మనకు తెలిసిందే.
అయ్యో bhAAi రప్పా రప్పా కోసుకున్నావా? #AlluArjun #RappaRappa pic.twitter.com/PhMWIDdpsa
— Gajala From Washington DC (@GajalaFrmWDC) June 22, 2025
ఇక అల్లు అర్జున్ కూడా ఎన్నో సర్జరీలు(Surgery) చేయించుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ తన స్నేహితులైన రానా, సుశాంత్, సుమంత్ వంటి వారితో కలిసి దిగిన ఒక పాత ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూస్తే మాత్రం అక్కడ ఉన్నది అల్లు అర్జునేనా అనే సందేహాలు కూడా కలుగుతాయి. అల్లు అర్జున్ ఈ ఫోటోలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ.. బన్నీ లుక్స్ పై కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫోటో చూస్తేనే స్పష్టంగా అర్థం అవుతుంది ఈ రూపంలోకి రావడానికి రప్పా..రప్పా కోస్తే ఆ బాధను తట్టుకొని ఈ రూపంలోకి వచ్చారో అంటూ కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా బన్నీకి సంబంధించిన ఈ రేర్ ఫోటో ఇన్నాళ్లకు బయటకు రావడంతో ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై బిగ్ అప్డేట్… స్వయంగా డైరెక్టరే