Tharun Bhascker: కొన్ని సినిమాలు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటాయి. ఇలా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలలో “ఈ నగరానికి ఏమైంది?”(Ee Nagaraniki Emaindi) సినిమా ఒకటి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఆ సమయంలో సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం సోషల్ మీడియా మీమ్స్ వల్ల యూత్‌కు ఈ సినిమా బాగా ఎక్కేసింది. ఇలా ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఈ చిత్రాన్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు మరొకసారి తీసుకువచ్చారు.
సీక్వెల్ కు సిద్ధమైన తరుణ్ భాస్కర్..
ఇలా రీ రిలీజ్ సమయంలో ఈ నగరానికి ఏమైంది చిత్రం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో తరుణ్ భాస్కర్ ఎక్కడికి వెళ్లినా తనకు ఈ సినిమాకు సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ సైతం ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెబుతూనే వచ్చారు కానీ, ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ నగరానికి ఏమైంది 2 (Ee Nagaraniki Emaindi2 )గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారని చెప్పాలి.
త్వరలో అధికారక ప్రకటన..
ఈ నగరానికి ఏమైంది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తరుణ్ భాస్కర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ విడుదల చేశారు. ఈనెల 29వ తేదీన సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతుందని ఈయన చెప్పకనే చెప్పేసారు. అదే విధంగా విశ్వక్ సేన్(Vishwak Sen), అభినవ్ గోమటం, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకమాను వంటి వారు తిరిగి ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి.
వివేక సాగర్ (Vivek Sagar)ఈ నగరానికి ఏమైంది సినిమాకు సంగీతం అందించారు అయితే సీక్వెల్ సినిమాకి కూడా ఈ అనే సంగీతం అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలన్నీ కూడా అధికారకంగా తెలియజేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని కామెడీ, జోష్ ను సీక్వెల్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భాస్కర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నెల 29వ తేదీ తరుణ్ భాస్కర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. పెళ్లిచూపులు సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ భాస్కర్ తనదైన శైలిలోని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా నటుడుగా కూడా ఈయన పలు సినిమాలలో నటిస్తూ వెండితెరపై సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నాం.. మోహన్ బాబు కామెంట్స్, అంత చీపా బ్రో?