RGV on Pawan Kalyan:సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇకపోతే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులూ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ పై అందరి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నేడు ఉదయం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ప్రమోషన్ కార్యక్రమాలలో హాజరయ్యారు.
ఫేక్ అకౌంట్..
నేడు ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ అంశాలకు తావు లేకుండా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా వస్తుంది అంటే మరొక హీరో అభిమానులు పెద్ద ఎత్తున నెగిటివిటీ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫేక్ అకౌంట్ ల ద్వారా వారి క్రియేటివిటీని బయటపెడుతూ ఉంటారు.
ఆర్జీవి పేరడీ అకౌంట్..
తాజాగా రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక ఫోటోని షేర్ చేశారు .ఈ ఫోటోలో భాగంగా పవన్ కళ్యాణ్ నేడు ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్నటువంటి ఫోటోని అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దుబాయ్ శీను సినిమాలోని ఎమ్మెస్ నారాయణ కామెడీ సీన్ ఫోటోని జత చేశారు. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ని కమెడియన్ ను చేస్తూ ఈ ఫోటో ఉందని చెప్పాలి. దీంతో ఈ ఫోటోపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటో రాంగోపాల్ వర్మ ఒరిజినల్ అకౌంట్ నుంచి వచ్చింది కాదని, “ఆర్జీవి పేరడీ” (Rgv Parody account)అనే అకౌంట్ నుంచి వచ్చిందని తెలుస్తోంది.
— Ram Gopal Varma (@rgvparody) July 21, 2025
ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పొరపాటున ఈ పోస్ట్ వర్మ చేశారని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వటమే కాకుండా… వర్మ ఇదివరకు ఇచ్చిన డోస్ సరిపోలేదా… మా హీరోనే అంత మాట అంటావా అంటూ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరు నిజంగానే వర్మ చేశాడని అనుకున్నామే అంటూ కూడా ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది కచ్చితంగా పవన్ యాంటీ ఫ్యాన్స్ పని అంటూ పవన్ అభిమానులు ఈ పోస్టుకు గట్టిగా కౌంటర్ ఇస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పాత్రలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: HHVM Pre Release Event: వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాఠీ చార్జ్… పలువురికి గాయాలు