HHVM Pre Release Event: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా జ్యోతి కృష్ణ (Jyothi Krishna)దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక వద్ద ఎంతో ఘనంగా జరగబోతుంది. మొదట్లో ఈ కార్యక్రమానికి అభిమానులకు అనుమతి లేకపోయినప్పటికీ చివరికి పోలీసులు అభిమానులకు అనుమతి తెలియజేశారు. సుమారు 1500 మంది అభిమానుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైనా తొక్కిసలాట జరిగితే పూర్తి బాధ్యత నిర్మాతలదేనంటూ కండిషన్లు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు శిల్పకళా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గందరగోల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు తప్పనిసరి పరిస్థితులలో అభిమానుల పై లాఠీ ఛార్జ్ చేయగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తుంది.
హాజరుకానున్న రాజకీయ నాయకులు…
పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలోనే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ పట్ల కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రెస్ మీట్ తో హైప్…
ఈరోజు ఉదయం చిత్ర బృందం ప్రెస్ మీట్ (Press Meet) కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఎన్నో అంశాలను అందరితో పంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్లను హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agerwal) ఒక్కటే నిర్వహించడం చూసి తనకు చాలా బాధగా ఉందని, ఈ సినిమా ఒక అనాధల ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించామంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
పవన్ స్పీచ్ పై ఆసక్తి…
ఇలా ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు దర్శకులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఉదయం జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ఎక్కడ రాజకీయ అంశాల గురించి మాట్లాడలేదు. మరి ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ స్పీచ్ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది. జులై 24వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Star Actress: బ్యాడ్ లక్.. ఈ హీరోయిన్లకు కలసి రాని రీ ఎంట్రీ?