Elephant Video Viral: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం నలుమూలల ఎక్కడేం జరిగిన ఈజీగా తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడీ వీడియోలు, జంతువులకు సంబంధించిన తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వైరల్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ బుల్లి ఏనుగు మనిషిలా కుర్చీలాగే కూర్చునేందుకు ప్రయత్నించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైకు, కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఒక చిన్న ఏనుగు బొమ్మ మనిషిలా కుర్చీపై కూర్చునేందుకు చాలా ప్రయత్నం చేసింది. సంబంధించిన వీడియో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ బుల్లి ఏనుగు అమాయకపు చేష్టలు, దాని ప్రవర్తన తీరు చూస్తుంటే నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో పిల్ల ఏనుగు అచ్చం మనిషిలా కుర్చునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏనుగు చిన్న చిన్న కాళ్లతో కుర్చీని కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. కానీ ఆ కుర్చీ ఏనుగు ప్రవర్తన తీరు పాడైపోయినట్టు వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియో క్లిప్ చూస్తుంటే చిన్న పిల్లలు కొత్త విషయాలను నేర్చుకునే పనిలో భాగమని అనిపిస్తుంటుంది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
?utm_source=ig_web_copy_link
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ట్విట్టర్ లో ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు. ‘ఈ బుల్లి ఏనుగు అమాయకమైన పనులు చూస్తుంటే.. నవ్వు ఆగడం లేదు’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘ఈ ఏనుగు బొమ్మ కుర్చీపై కూర్చోవడానికి ప్రయత్నిస్తున్న తీరు చూస్తే నాకు సంతోషంగా అనిపించిది’ అని కామెంట్ చేసుకొచ్చారు. మరొక నెటిజన్ ‘ఈ చిన్న ఏనుగు ఎంత అమాయకంగా ఉందో.. దీన్ని చూస్తుంటే నవ్వు వస్తోంది’ అని కామెంట్ చేశారు.
ALSO READ: Heavy Rain: రాష్ట్రంలో ఐదు రోజులు వర్షం దంచుడే దంచుడు.. ఉరుములు, పిడుగలతో..!
ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం మూగజీవాల చేష్టలను మాత్రమే కాకుండా.. సహజమైన ఉత్సుకతను, నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా తెలియజేస్తుంది. ఈ ఏనుగు మనిషిలా కూర్చోవడానికి ప్రయత్నించడం ద్వారా.. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని చూపిస్తుంది. ఇది మనకు జంతువులలోని అమాయకత్వం, మనుషుల స్వభావాన్ని గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ కావడం వల్ల నెటిజన్లు కొంత సమయం ఆనందంగా గడపడానికి అవకాశం లభిస్తుంది.
ALSO READ: Gandikota Murder: వీడిన గండికోట మర్డర్ మిస్టరీ.. హత్య చేసింది వాళ్లే, అరే.. మీరు మనుషులేనా?