OTT Movie : రీసెంట్ గా ఓటీటీలలోకి వచ్చిన ఒక హాలీవుడ్ హారర్ సినిమా హడలెత్తిస్తోంది. ఈ చిత్రం ఒక యువతిని ఆవహించిన దుష్టశక్తిని ఎదుర్కొనే ఒక క్లైర్‌వాయంట్ సైకియాట్రిస్ట్, ఆమె కుమార్తె చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ‘ఇన్సిడియస్’, ‘ఇట్ ఫాలోస్’ వంటి చిత్రాల నుండి స్ఫూర్తి పొందినప్పటికీ, తల్లీ-కూతుళ్ల డైనమిక్ థీమ్స్‌తో తనదైన గుర్తింపును సంపాదించింది. ఇది లో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ అయినప్పటికీ, దాని ఎమోషనల్ డెప్త్, క్రీపీ విజువల్స్, బలమైన నటనలకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ఇట్ ఫీడ్స్’ (It feeds) 2025లో విడుదలైన కెనడియన్ సైకలాజికల్ సూపర్‌నాచురల్ హారర్ ఫిల్మ్. దీనికి చాడ్ ఆర్చిబాల్డ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బ్లాక్ ఫాన్ ఫిల్మ్స్ నిర్మాణంలో భాగంగా, ఆశ్లే గ్రీన్, షాన్ ఆష్‌మోర్, ఎల్లీ ఓ’బ్రియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేట్రికల్ రిలీస్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది. 1 గంట 42 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.6/10 రేటింగ్ ను కలిగి ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా స్టోరీ సింథియా విన్‌స్టోన్ అనే క్లైర్‌వాయంట్ సైకియాట్రిస్ట్‌తో మొదలవుతుంది. ఆమె తన ఇంటి నుండి సైకియాట్రిక్ ప్రాక్టీస్ నడుపుతుంటుంది. సింథియా తన సైకియాట్రిక్ సామర్థ్యాలను ఉపయోగించి, రోగుల భయాలను, వారి మనస్సులోకి ప్రవేశించి అర్థం చేసుకుంటుంది. ఆమె టీనేజ్ కూతురు జోర్డాన్ ఆమెకు సహాయకురాలిగా పనిచేస్తుంటుంది. అయితే జోర్డాన్‌కు ఇంకా తన తల్లి లాంటి క్లైర్‌వాయంట్ సామర్థ్యాలు పూర్తిగా రాలేదు. సింథియా, జోర్డాన్‌ల జీవితంలో కూడా ఒక ట్రామా ఉంది. సింథియా భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. ఈ ప్రభావం ఇద్దరిపై చూపిస్తుంది.
ఒక రోజు రిలే హారిస్ అనే యువతి భయాందోళనతో సింథియా ఇంటి ప్రాక్టీస్‌లోకి పరుగెత్తుకొస్తుంది. తనను ఒక దుష్ట శక్తి ఇబ్బంది పెడుతోందని చెబుతుంది. రిలే శరీరంపై ఉన్న మచ్చలు, ఆమె భయంకరమైన స్థితి సింథియాను ఆందోళనకు గురిచేస్తాయి. సింథియా మొదట రిలేను చికిత్స చేయడానికి సంకోచిస్తుంది. అయితే జోర్డాన్ తన తల్లి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రిలేకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఆమె తండ్రి ఇలాంటి సందర్భంలో సహాయం చేసేవాడని చెబుతుంది.
రిలే తండ్రి రాండాల్ కూడా కథలోకి వస్తాడు. అతను తన కూతురి పరిస్థితి చూసి ఆందోళనకు గురవుతాడు. సింథియా, జోర్డాన్ రిలేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ శక్తి వారి జీవితాలను కూడా బెదిరిస్తుంది. సినిమా ఒక “డ్రీమ్‌స్కేప్” లాంటి కాన్సెప్ట్‌ను ఉపయోగిస్తుంది. ఇక్కడ సింథియా రిలే మనస్సులోకి ప్రవేశించి, ఆరూపాన్ని చూస్తుంది. ఈ దృశ్యాలు విజువల్‌గా భయంకరంగా, ఇంటెన్స్‌గా ఉంటాయి. ఈ దుష్ట శక్తికి ఎవరైనా భయపడితే దాని బలం పెరుగుతూ ఉంటుంది.
ఇక సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ దుష్ట శక్తి సింథియా, జోర్డాన్‌ల జీవితాలలో కూడా ప్రవేశిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో, సింథియా జోర్డాన్ ఒక సైకిక్ యుద్ధంలో ఆ దుష్ట శక్తితో పోరాడతారు. ఇక్కడ వీళ్ళు ఫ్యాషనబుల్ గోథిక్ దుస్తులలో మీలీ వెపన్స్ ఉపయోగించి దానిని ఎదుర్కొంటారు. అయితే ఈ యుద్ధం ఎమోషనల్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుంది. సింథియా, జోర్డాన్ లు ఈ దుష్టశక్తిని ఎదుర్కుంటారా ? దానికి బలవుతారా ? సింథియా భర్త ఎలా చనిపోయాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : మంచానపడ్డ మొగుడు… మరొకడిపై ప్రేమతో చేయకూడని పని… ఇదెక్కడి విడ్డూరం సామీ