E-Paper
Advertisement

Telugu directors association: తెలుగు ఫిల్మ్ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య.. సాయి రాజేష్ కి కూడా కొత్త పోస్ట్..!

Telugu directors association: తెలుగు ఫిల్మ్ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య.. సాయి రాజేష్ కి కూడా కొత్త పోస్ట్..!
Advertisement

Telugu directors association: హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్ దర్శకుల సంఘం ఎన్నికలు ఇటీవల నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య సంఘం కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న దర్శకుడు కావడంతో ఆయన ఎంపికపై చాలా మంది సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి సినిమాలతో ఈ దర్శకుడు మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

తెలుగు సినిమా రంగంలో దర్శకుల సంఘం చాలా ముఖ్యమైన సంస్థగా ఉంటుంది. దర్శకుల సమస్యలు, హక్కులు.. వారి అభివృద్ధి కోసం ఈ సంఘం పని చేస్తుంది. అందుకే ప్రతి ఎన్నిక కూడా సినీ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది.

Advertisement

ఈసారి జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి. వీఎన్ ఆదిత్య గెలుపొందారు. ఆయన గతంలో కూడా పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే..!

ఇక ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా సముద్ర ఎన్నికయ్యారు. ఆయన కూడా సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న దర్శకుడు. దర్శకుల సంఘం కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటూ ఉంటారు. అందుకే ఆయనను ఈ పదవికి ఎన్నుకున్నారు.

Advertisement

అదేవిధంగా సంఘం ప్రధాన కార్యదర్శిగా రామారావు ఎన్నికయ్యారు. సంఘం కార్యకలాపాలను నిర్వహించడం, సమావేశాలు నిర్వహించడం వంటి ముఖ్యమైన బాధ్యతలు ఈ పదవికి ఉంటాయి. రామారావు ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ట్రెజరర్‌గా సాయి రాజేష్ ఎన్నికయ్యారు. సంఘానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం ట్రెజరర్ బాధ్యత. ఈ బాధ్యతను సాయి రాజేష్ సక్రమంగా నిర్వహిస్తారని దర్శకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులకు సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు దర్శకులు, నిర్మాతలు మరియు ఇతర సినీ ప్రముఖులు కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు.

కొత్తగా ఏర్పడిన ఈ కమిటీతో తెలుగు ఫిల్మ్ దర్శకుల సంఘం మరింత బలపడుతుందని, దర్శకుల సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నారు. అలాగే తెలుగు సినిమా అభివృద్ధికి కూడా ఈ సంఘం కీలక పాత్ర పోషిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ: Jr NTR: వాళ్ళిద్దరిని కోల్పోయాను..సక్సెస్ ఊరికే రాదు.‌.ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్యలు..!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×