Niharika: నిహారిక కొణిదెల (Niharika Konidela).. మెగా వారసురాలిగా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంది. అందులో భాగంగానే యాంకర్ గా తొలి అడుగులు వేసింది. ఆ తర్వాత ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది.ఆ సినిమాలో ఈమె నటనకు ప్రశంసలు లభించాయి. కానీ కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాలేదు. అందుకే హీరోయిన్ గా ప్రయత్నాలు చేయడం పక్కనపెట్టి.. నిర్మాతగా అడుగులు వేసింది
విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక..
అందులో భాగంగానే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ ను స్థాపించి.. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు బెస్ట్ ప్రొడ్యూసర్ గా ‘గద్దర్ అవార్డు’ కూడా అందుకుంది నిహారిక. ఇకపోతే కెరియర్ పరంగా సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పెద్దల కోరిక మేరకు చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) ను పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లయిన ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పటివరకు విడాకులపై స్పందించలేదు. కానీ తొలిసారి విడాకులపై మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
నొప్పి భరించే వాడికే తెలుస్తుంది – నిహారిక
నిహారిక మాట్లాడుతూ.. “అందరూ కూడా నాది ప్రేమ వివాహం అనుకుంటున్నారు. అసలు మీకేం తెలుసు. నేను పెళ్లి చేసుకున్నాను అనేది.. ఎందుకు విడిపోయాము అనేది..అదంతా కేవలం నా వ్యక్తిగత జీవితం. నాకు తగిలిన దెబ్బకు నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది. మీకు కాదు కదా.. ఎందుకు విడాకులు తీసుకున్నానో నాకు మాత్రమే తెలుసు. నొప్పి అనుభవించే వాడికే తెలుస్తుంది” అంటూ తన అనుభవాలను పంచుకొచ్చింది నిహారిక.
మా నాన్నకు నేను భారం కాలేదు..
అలాగే విడాకుల సమయంలో తన తండ్రి తనకు ఎలా అండగా నిలిచారు అనే విషయంపై కూడా నిహారిక చెప్పుకొచ్చింది. మా నాన్న (సినీ నటుడు నాగబాబు) ఎప్పుడూ కూడా నన్ను భారం లా భావించలేదు. ఒక బాధ్యత గానే భావించాడు. మా నాన్నకి 65 సంవత్సరాల వయసు అయి ఉండొచ్చు. కానీ ఆయన ఇంకా పాతకాలంలోనే ఉండిపోలేదు. విడాకుల గురించి నేను చెప్పినప్పుడు నీకు 60 ఏళ్లు వచ్చినా నేను చూసుకుంటాను. వచ్చెయ్ అని అన్నాడు. అటు మా నాన్నతో పాటు మా అన్నయ్య (Varun Tej) కూడా ఆ దేవుడు ఇచ్చిన అరుదైన బహుమతి గానే భావిస్తాను.అంటూ ఎమోషనల్ అయింది నిహారిక. ఇక బయటకి ఎప్పుడు నవ్వుతూ కనిపించే నిహారిక మనసులో ఇంత భారం ఉందా అని తెలిసి అభిమానుల సైతం బాధ పడిపోతున్నారు. అంతేకాదు నిహారికపై చాలామంది చేసిన ట్రోల్స్ కి ఈ ఒక్క మాటతో గట్టి కౌంటర్ ఇచ్చిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే నిహారిక విడాకుల తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను అభిమానులతో పంచుకుంది.
ALSO READ:Renu Desai: అలాంటి మూర్ఖులపై చర్యలు తీసుకోవాలి.. అవమానించడం ఫ్యాషన్ అంటూ!