E-Paper
Advertisement

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!
Advertisement

Nikhil Swayambhu:చందు మొండేటి (Chandu mondeti) దర్శకత్వంలో ‘కార్తికేయ 1,2 ‘ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో నిఖిల్(Nikhil) తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ లో రాబోతున్న ఈ చిత్రం ప్రాచీన రాజుల కాలంనాటి కథాంశంతో రాబోతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో ఒక పోరాడే వీర యోధుడిగా నిఖిల్ కనిపించబోతున్నారు. భరత్ కృష్ణమాచారి (Bharath krishmachari) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon), నభా నటేష్(Nabha natesh)హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. మరొకవైపు ఈ సినిమా షూటింగు కూడా శరవేగంగా జరుపుకుంటోంది.

స్వయంభులో శక్తిమాన్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో నిఖిల్, హీరోయిన్లు నభా నటేష్ , సంయుక్త మీనన్ ప్రముఖ యాంకర్ సుమ (Suma) తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న హీరో నిఖిల్.. ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ను లీక్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. నిఖిల్ మాట్లాడుతూ..” ఈ సినిమా సుమారుగా వెయ్యేళ్ల క్రితం నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపు దిద్దుకుంది. క్రీస్తు శకం 985వ సంవత్సరంలో రాజుల కాలంలో తిరుపతి సమీపంలోని శ్రీగిరి అనే ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ కథ ఆధారంగానే ఈ సినిమాను రూపొందించాము.

Advertisement

also read:శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

శక్తిమాన్ పాత్ర పై నిఖిల్..

ముఖ్యంగా ఈ సినిమాలో అందరి ఫేవరెట్ ‘శక్తిమాన్’ హీరో ముఖేష్ ఖన్నా (Mukhesh khanna)ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆయన పాత్ర చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్లలో సినిమా చూశాక ఆయన పాత్రను చూసి ప్రేక్షకులు మరింత సర్ప్రైజ్ అవుతారు. అంటూ నిఖిల్ తెలిపారు. మొత్తానికి అయితే శక్తిమాన్ పాత్రధారి ముఖేష్ ఖన్నా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారని నిఖిల్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ముఖేష్ ఖన్నా తెలుగు సినిమాలు..

Advertisement

1997 నుంచి 2005 మధ్యకాలంలో వచ్చిన శక్తిమాన్ సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ముఖేష్ ఖన్నా.. తెలుగులో పురుషోత్తముడు, ధన 55 వంటి చిత్రాలలో నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్వయంభూ సినిమాతో టాలీవుడ్ తెరపై సందడి చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో ఆయన ఇంకెలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రవి బస్రూర్ సంగీతంతో రూపొందించిన ఈ చిత్రం చరిత్రలో ఒక స్వర్ణ యుగాన్ని స్థాపించే పౌరాణిక యోధ చక్రవర్తి కథను ఆవిష్కరిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఇందులో సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×