E-Paper
Advertisement

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!
Advertisement

PC Performance Tips: మనలో చాలామంది కొత్తలో PC లేదా Laptop చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంటే సంబరపడిపోతాం. కానీ కొద్దిరోజులు గడిచేసరికి అది స్లో అయిపోవడం, ప్రాసెస్ అవ్వడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడం గమనిస్తుంటాము. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా.. దాని ఆయుష్షు కూడా చాలాకాలం పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్:

మీ సిస్టమ్‌లోని విండోస్ లేదా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించడానికి, బగ్స్‌ను సరిచేయడానికి ఈ అప్‌డేట్స్ చాలా అవసరం. ఇవి మీ పీసీరి మంచి స్టెబిలిటీని ఇస్తాయి.

అనవసరమైన ఫైల్స్, యాప్స్ డిలీట్:

Advertisement

కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు కొన్ని అనవసరమైన యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. వీటిని డిసేబుల్ చేస్తే సిస్టమ్ త్వరగా బూట్ అవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు తాత్కాలిక ఫైల్స్, క్యాచే, రీసైకిల్ బిన్‌లోని వేస్ట్ డాటాను క్లియర్ చేస్తే స్టోరేజ్ ఖాళీ అయి కంప్యూటర్ వేగంగా పనిచేస్తుంది.

Also Read: 8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

SSDలోకి మారడం:

Advertisement

మీ దగ్గర ఉన్న పాత హార్డ్ డిస్క్ స్థానంలో ఎస్‌ఎస్‌డి (SSD)కి మారితే కంప్యూటర్ స్పీడ్ అమాంతం పెరుగుతుంది. అప్లికేషన్లు చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతాయి. అలాగే మీరు ఒకేసారి చాలా ట్యాబ్‌లు లేదా పెద్ద సాఫ్ట్‌వేర్లు వాడేవారైతే ర్యామ్ (RAM) పెంచుకోవడం వల్ల మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా మారుతుంది.

డస్ట్ క్లీనింగ్, హీట్ మేనేజ్‌మెంట్:

కంప్యూటర్ ఫ్యాన్లు, వెంట్లపై పేరుకుపోయిన దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. గాలి సరిగ్గా ఆడకపోతే ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్ వేడెక్కి పాడైపోయే ప్రమాదం ఉంది. మంచి మానిటరింగ్ టూల్స్ వాడి సిస్టమ్ టెంపరేచర్‌ను చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.

యాంటీవైరస్ వాడకం, రీస్టార్ట్ చేయడం:

వైరస్‌ల నుండి రక్షణ పొందేందుకు నమ్మకమైన యాంటీవైరస్ వాడాలి. అలాగే రోజూ లేదా రెండు రోజులకోసారైనా పిసిని రీస్టార్ట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు క్లియర్ అయి, మెమరీ రీఫ్రెష్ అవుతుంది. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ల్యాప్‌టాప్ ఎప్పటికీ స్మూత్‌గా పనిచేస్తుంది.

Also Read: వావ్.. గూగుల్ పిక్సెల్ 10 ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో షాకింగ్ ప్రైస్!

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×