E-Paper
Advertisement

స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!
Advertisement

Mahesh Anand: సినిమాలో కెరీర్ పీక్స్ చూసిన తారలు ఎందఱో ఆ తర్వాత ఎటూ కాకుండా పోయారు.ఎంతలా అంటే కోట్లు సంపాదించినా చివరి రోజుల్లో చిల్లి గవ్వ లేనంతగా. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మహేష్ ఆనంద్. స్టార్ విలన్ గా ఒకదశలో టాప్ హీరోల కి మించి స్టార్ స్టేటస్ చూసిన ఈ నటుడి జర్నీ చివరి రోజుల్లో దిక్కులేని వాడిగా ముగియడం నిజంగా బాధాకరం.

మహేష్ ఆనంద్ విషయానికి వస్తే 1961 ఆగస్టు 13న జనించిన మహేష్ సినిమా కెరీర్ 1982లో ‘సనమ్ తేరీ కసమ్’ సినిమాతో మొదలైంది.బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలెట్టిన మహేష్ కి మంచి బాడీ , భయపెట్టే గొంతు, మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ వంటివి అతడి కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి.ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా అమితాబ్ హీరోగా 1988లో వచ్చిన’షహెన్‌షా’సినిమా మహేష్ ఆనంద్ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమాలో కరుడు గట్టిన విలన్ గా మహేష్ చూపించిన నటన నెక్స్ట్ లెవెల్.ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలని చేసుకుంటూ పోయాడు.అలా చేసిన గంగా జమునా సరస్వతి, తూఫాన్, గుమ్రా, సస్తి దుల్హన్ మహాంగ్ దుల్హా, ఖుద్దార్, స్వర్గ్, వర్ధీ వంటి ఎన్నో సినిమాలని మహేష్ విలనిజం మరో మెట్టు ఎక్కించాయంటే ఆశ్చర్యం లేదు.

ఏడాదికి ఆరు నుండి ఎనిమిది సినిమాలు

Advertisement

ముఖ్యంగా 90S కాలంలో మహేష్ కి ఎంతలా డిమాండ్ ఉందంటే ఏడాదికి ఆరు నుండి ఎనిమిది సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోలకన్నా బాగా బిజీగా ఉండేవాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుస పెట్టి 300కు పైగా హిందీ సినిమాలని తన ఖాతాలో వేసుకొని ఒక వెలుగు వెలిగాడు.అలా కేవలం హిందీలోనే కాదండోయ్.. తెలుగులోనూ టాప్ హీరోస్ అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, కృష్ణల సరసన ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించాడు కూడా. ముఖ్యంగా లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా,’టాప్ హీరో,బాలు వంటి సినిమాల్లో కనిపించి తనదైన విలనిజం తో భయపెట్టాడు మహేష్. ఇక అన్నింటి కన్నా ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన నెంబర్ వన్ సినిమాలో మహేష్ పండించిన వెరైటీ విలనిజాన్ని ఇప్పటికీ మర్చిపోలేము.అందులో హీరోయిన్ సౌందర్యతో ‘రంభ ఆయిరే హొయిరో హొయ్’ అనే పాటకి వేసిన స్టెప్పులు ,బ్రహ్మానందంతో పేపర్ ముక్కలు చింపించి మళ్లీ అతికించమనడం వంటి సీన్స్ కి థియేటర్లు నవ్వులతో ఊగిపోయాయి.అన్నింటికన్నా మించి కామెడీని విలనిజం లో ఆయన బ్లెండ్ చేసిన తీరుకి హ్యాట్సాఫ్.

5 పెళ్ళిళ్ళు,12 మందితో నెరిపిన ప్రేమాయణాలు

అయితే సినిమా కెరీర్ లో ఎంతటి పీక్స్ ని చూశాడో, పర్సనల్ లైఫ్ లో అంతకు మించి అప్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేశాడు మహేష్, ముఖ్యంగా అడ్డే లేదన్నట్టుగా చేసుకున్న 5 పెళ్ళిళ్ళు,12 మందితో నెరిపిన ప్రేమాయణాలు అతడి జీవితాన్ని అతలాకుతలం చేశాయనే చెప్పాలి. మొదటగా రీనా రాయ్ ని పెళ్లి చేసుకున్న మహేష్ ఆ బంధాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయాడు. ఆ తర్వాత
బర్ఖా రాయ్‌ తో జరిగిన పెళ్ళీ పెటాకులు అయిపొయింది.

Advertisement

ఇక ముచ్చటగా మూడోసారి అంటూ 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరికా మరియా డిసౌజాను పెళ్లి చేసుకోగా ఈ జంటకి ఒక కొడుకు పుట్టాడు. ఇక నాకిది చాలా కామన్ అంటూ ఎరికాతోనూ తెగదెంపులు చేసుకున్న మహేష్ 1992లో మధు మల్హోత్రా మెడలో మూడు ముళ్ళు వేశాడు .ఆ బంధమూ అంతంత మాత్రంగానే సాగడంతో నాల్గవసారి నటి ఉషా బచ్చన్‌ ని పెళ్లి చేసుకున్నాడు.ఇక పెళ్ళీ రెండేళ్లకే పెటాకులు అవడంతో చివరిగా రష్యన్ అమ్మాయి అయిన లానాను 2015లో పెళ్లి చేసుకొని సరికొత్తగా కెరీర్ మొదలెట్టాలనుకున్నాడు మహేష్.కానీ లానా కూడా మహేష్ కి హ్యాండ్ ఇవ్వడంతో బాగా కుంగిపోయాడు మహేష్.ఇక అదే క్రమంలో సినిమా అవకాశాలు కూడా భాగా తగ్గిపోవడం, లైఫ్ లో క్రమశిక్షణ మిస్ అవడంతో ఇండస్ట్రీకి ఒక రకంగా దూరం అయిపోయాడు.

ఇక సినిమాలు కూడా లేకపోవడం, నమ్మిన వారే కోట్ల రూపాయాలు మోసం చేయడంతో చివరి రోజుల్లో రెజ్లింగ్ మ్యాచ్‌లు కూడా ఆడాల్సి వచ్చింది. ఇక చివరిగా 18 ఏళ్ల గ్యాప్ తర్వాత గోవిందా హీరోగా వచ్చిన ‘రంగీలా రాజా’లో ఒక చిన్న పాత్రలో కనబడి సినిమా జీవితానికి ముగింపు పలికాడు మహేష్ ఆనంద్.అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం, ఆ సినిమా రిలీజ్ అయిన 22 రోజులకే మహేష్ చనిపోవడం బాధాకరం .

ఒంటరితనంతో పోరాడి కన్నుమూయడం నిజంగా బాధాకరం

ఒంటరిగా, ఒక అనాథలా చివరి రోజులని గడిపిన మహేష్ బాగా తాగుడుకి అలవాటు పడి 2019 ఫిబ్రవరి 9నముంబై వెర్సోవా ప్రాంతంలోని యారి రోడ్‌లో ఉన్న కినారా అపార్ట్‌మెంట్స్‌లోని తన ప్లాట్ లో కన్ను మూశాడు. రెండు రోజులుగా ప్లాట్ తలుపులు తీయకపోవడం, బయటే ఫుడ్ ప్యాకెట్లు అన్నీ ఉండటంతో పని మనిషి అతడి సోదరికి ఫోన్ చేయడం, వాళ్ళు వచ్చి చూడటంతో మహేష్ చనిపోయిన వార్త బయటి ప్రపంచానికి తెల్సింది. సోఫా పై మహేష్ చనిపోయిన తీరు చూసి హార్ట్ ఎటాక్ వల్లే చనిపోయాడని నిర్ధారించారు పోలీసులు.

also read:చాపెల్ వివాదం నుండి లార్డ్స్ గర్జన వరకు.. గంగూలీ బయోపిక్‌పై భారీ అంచనాలు!

ఇక డెడ్ బాడీ పోస్ట్ మార్టం తర్వాత దాదాపు రెండు రోజులు బాడీ ఆస్పత్రిలోనే ఉండటం , ఆ తర్వాత రష్యా నుండి చివరి భార్య లానా ముంబైకి వచ్చి అంత్యక్రియలు జరపడం జరిగాయి .ఏది ఏమైనా ఇండస్ట్రీ లో ఎంతో పీక్స్ చూసిన మహేష్ ఆనంద్ ఇలా 57 ఏళ్ల వయసులోనే ఆర్థిక ఇబ్బందులతో, ఒంటరితనంతో పోరాడి కన్నుమూయడం నిజంగా బాధాకరం !

Related News

సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !

అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?

సోదరి అన్షు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జాన్వీ వాచ్.. ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

చాపెల్ వివాదం నుండి లార్డ్స్ గర్జన వరకు.. గంగూలీ బయోపిక్‌పై భారీ అంచనాలు!

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

సడెన్ గా ఓటీటీకి వచ్చేసిన సింగీతం మ్యాజిక్.. ఎందులో చూడాలో తెలుసా?

అమితాబ్ అర్ధరాత్రి రూ.15 కోట్ల ల్యాండ్ డీల్.. భూముల కొనుగోలుపై కీలక విషయాలు వెలుగులోకి!

Big Stories

Advertisement
×