Payal Rajput: పాయల్ రాజ్‌పుత్…ఇప్పుడంటే కాస్త స్లో అయింది కాని RX 100సినిమా వచ్చిన సమయంలో ఈ అమ్మడు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.ముఖ్యంగా ఇందు అనే పాత్రలో పాయల్ చేసిన నటనకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ప్రేమించి మోసం చేసే అమ్మాయిగా ఇచ్చిన ఫెర్ఫామెన్స్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. ఇక ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసినా మొదటి సినిమా చేసిన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయలేకపోయింది.
నెలకి లక్షల్లో సంపాదిస్తున్న అందాల భామలు
ఇక ఇదిలా ఉంటె తాజగా పాయల్ తీసుకున్న ఒక క్రేజీ డిసీషన్ ఇపుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.అవును ..సిల్వర్ స్క్రీన్ పై ఎన్ని అందాలు ఆరబోసినా రియల్ లైఫ్ లో మాత్రం తనకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని కుండబద్దలు కొట్టేస్తుంది. ఈ మధ్య ఎంతో మంది అందాల భామలు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన సరికొత్త ఆప్షన్ ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను ఏ రకంగా వాడుకుంటున్నారో చెప్పక్కర్లేదు.పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా ,ముఖ్యంగా మన విష్ణు ప్రియ వంటి వారు దీనిపై నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారని నెట్టింట్లో టాక్ .నిజానికి మన దగ్గర ఇది ఈ మధ్యే మొదలైనా హాలీవుడ్ లో ఓన్లీ ఫ్యాన్స్’ వంటి ప్లాట్‌ఫామ్స్ కేవలం అడల్ట్ అండ్ గ్లామర్ కంటెంట్ ని షేర్ చేయడానికే వాడుతుంటారు.
వ్యూయర్స్ నుండి డబ్బులు లాగేస్తుందా
అయితే రీసెంట్ గా పాయల్ కూడా ఇలాగే ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్ తో ఉన్న చానెల్ ఓపెన్ చేసింది. దీంతో ఇక ఈ అమ్మడు కూడా అందరిలాగే బోల్డ్ కంటెంట్ అండ్ హాట్ పిక్స్ తో వ్యూయర్స్ నుండి డబ్బులు లాగేస్తుందా అంటూ అనుమానాలు, అంచనాలు ,ఆశలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి.ఇక మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి అసలక్కడ ఎలాంటి హాట్ కంటెంట్ షో చేయబోతున్నారు అంటూ ఇన్-బాక్స్‌లో మెసేజ్‌లో మెసేజెస్ చేయడం కూడా మొదలెట్టారు.
అందుకోసం అయితే నో
ఇక వ్యూయర్స్ కోరికల హద్దులు శృతి మించడంతో వాటికి ఎండ్ కార్డ్ వేస్తూ క్లారిటీ ఇచ్చింది పాయల్. ఎవరైనా తన చానెల్ కి గ్లామరస్ ఫోటోలు చూడటం కోసమో, లేక అడల్ట్ కంటెంట్ ఏదైనా ఆశించి రావాలనుకుంటే మాత్రం తన చానెల్ ని అస్సలు సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దని కుండ బద్దలు కొట్టేసింది. అసలు తన చానెల్ అలాంటి కంటెంట్ ఇచ్చేందుకు అసలే కాదని తేల్చి చెప్పేసింది.ఈ చానెల్ కేవలం ఒక నటిగా తానూ ఎంత కష్టపడతానో తెలీడానికే అని , లైఫ్ లో ఎలాంటి ఫిల్టర్ లేకుండా ,డైలీ తను ఫేస్ చేసే అనుభవాలని తనని ఫాలో అయ్యే రియల్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడానికే ఇలా కొత్త చానెల్ ని ఓపెన్ చేసినట్టు చెప్పుకొచ్చింది.అన్నింటి కన్నా మించి తనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడే వారికే ఇక్కడ స్థానం అని తేల్చి చెప్పింది.ఏది ఏమైనా బిజినెస్ కి చాలా స్కోప్ ఉన్నప్పటికీ ఈ ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్ ని ఇలా పద్దతిగా వాడుతున్న పాయల్ ని మెచ్చుకొని తీరాల్సిందే !
also read:స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!