E-Paper
Advertisement

క్రెడిట్ కార్డ్ ఉందని తెగ స్వైప్ చేస్తున్నారా? ఈ 5 చోట్ల జాగ్రత్త.. నిండా మునిగిపోతారు!

క్రెడిట్ కార్డ్ ఉందని తెగ స్వైప్ చేస్తున్నారా? ఈ 5 చోట్ల జాగ్రత్త.. నిండా మునిగిపోతారు!
Advertisement

Credit Card Tips: ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. జేబులో నగదు లేకపోయినా.. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డ్ ఉంటే కొండంత ధీమాగా ఉంటుందని వారి అభిప్రాయం. రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్ ఈఎంఐల ఆశతో చాలామంది ప్రతి చిన్న ఖర్చుకూ క్రెడిట్ కార్డ్‌లనే వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల మేలు ఉన్నప్పటికీ.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్ల కొన్ని రకాల చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌ను అస్సలు వాడొద్దని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఏటీఎం వద్ద నగదు విత్‌డ్రా

అయితే చాలా మంది ఏటీఎం వద్దకు వెళ్లి క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు డ్రా చేస్తుంటారు. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను అస్సలు ఊహించరు. డెబిట్ కార్డ్ లాగా క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుండి నగదు తీస్తే ఆ నిమిషం నుంచే వడ్డీ మొదలవుతుంది. దీనికి ఎలాంటి ‘గ్రేస్ పీరియడ్’ ఉండదు. దీంతో పాటు ‘క్యాష్ అడ్వాన్స్ ఫీజ్’ పేరిట విత్‌డ్రా చేసిన మొత్తంలో 2.5% నుండి 3% వరకు అదనపు ఛార్జీలు విధిస్తారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎంలో డబ్బు తీయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

పెట్రోల్ బంకుల్లో పేమెంట్స్

Advertisement

క్రెడిట్ కార్డ్ ద్వారా పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తే.. బిల్లుపై ‘ఫ్యూయల్ సర్ఛార్జ్’ (Fuel Surcharge) పడుతుంది. ఇది సాధారణంగా 1% నుండి 3% వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ ఫీజు మినహాయింపు ఇస్తున్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు విధిస్తున్నాయి. పెట్రోల్ బిల్లు బిల్లు రూ.400 నుండి రూ.4000 మధ్యే ఉండాలని షరతు విధిస్తున్నాయి. ఒకవేళ మీ కార్డ్‌కు ఈ సదుపాయం లేకపోతే ప్రతీ పేమెంట్ కు అదనపు బాదుడు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఇంధన అవసరాలకు వీలైనంత వరకు నగదు, యూపీఐ వాడటం మంచిదని స్పష్టం చేస్తున్నారు.

రైల్వే టికెట్ బుకింగ్స్

ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రైల్వే కౌంటర్ల వద్ద క్రెడిట్ కార్డ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా యూపీఐతో పోలిస్తే క్రెడిట్ కార్డ్‌లపై ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ప్రయాణాలు చేసేవారైతే ప్రతిసారీ ఈ అదనపు ఛార్జీలు చెల్లించడం వల్ల పెద్ద మెుత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

అనధికారిక వెబ్‌సైట్లు

Advertisement

ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. HTTPS లేని వెబ్‌సైట్లు, గుర్తింపు లేని చిన్న ఈ-కామర్స్ సైట్లలో క్రెడిట్ కార్డ్ వివరాలను అస్సలు నమోదు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డు నెంబర్, సీవీవీ లీక్ అయితే క్షణాల్లో కార్డు నుంచి వేల రూపాయల నగదు మాయం అయిపోతాయని పేర్కొంటున్నారు.

Also Read: వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతికినా మురికిగా ఉన్నాయా? ఈ 5 తప్పులే కారణం!

అంతర్జాతీయ లావాదేవీలు

విదేశీ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసేటప్పుడు, విదేశాలకు వెళ్లినప్పుడు కొందరు సాధారణ క్రెడిట్ కార్డులనే వినియోగిస్తుంటారు. దీనివల్ల ‘ఫారిన్ కరెన్సీ మార్కప్ ఫీజ్’ (Foreign Currency Markup Fee) భారీగా పడే ఛాన్స్ ఉంది. ఖర్తు చేసే మొత్తంలో 3% నుండి 4% వరకు ఈ ఫీజు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీంతో జీఎస్టీ అదనంగా పడనుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి విదేశాల్లో క్రెడిట్ కార్డ్ వాడాలనుకుంటే ప్రత్యేకంగా ‘జీరో మార్కప్ ఫీజ్’ ఉన్న అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌, ట్రావెల్ కార్డ్‌లను వినియోగిస్తే మంచిదని నిపుణులు హితవు పలుకుతున్నారు.

Also Read: ATMలో కార్డ్ ఇరుక్కుపోయిందా? కంగారు వద్దు మామ.. వెంటనే ఇలా చేయండి!

Related News

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!

Big Stories

Advertisement
×