E-Paper
Advertisement

IPL 2026: ఐపీఎల్ 2026 లో పెను సంచ‌ల‌నం…ఢిల్లీ, KKRకు కొత్త కెప్టెన్లు?

IPL 2026: ఐపీఎల్ 2026 లో పెను సంచ‌ల‌నం…ఢిల్లీ, KKRకు కొత్త కెప్టెన్లు?
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే కేకేఆర్ జట్లకు కొత్త కెప్టెన్లు రాబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం సంజు శాంస‌న్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. సంజు శాంస‌న్‌ ను జట్టులోకి తీసుకోవడమే కాకుండా కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటున్నారట. అదే జరిగితే అక్షర్ పటేల్ పై వేటు పడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సంజు శాంస‌న్ కు బదులు మరొక ప్లేయర్ ను రాజస్థాన్ రాయల్స్ కు ట్రేడ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Also Read: Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

Advertisement

అదే సమయంలో ఢిల్లీ ఆటగాడైన కేఎల్ రాహుల్ ను కేకేఆర్ ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేస్తోందట కేకేఆర్‌. ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్ ను ఎంత ధ‌ర‌కైనా కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇచ్చేందుకు కూడా సిద్ధమైందట కేకేఆర్. దీనికి కేఎల్ రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. తమ జట్టు నుంచి ఒక ప్లేయర్ ను ఢిల్లీకి ఇచ్చి ట్రేడింగ్ ద్వారా రాహుల్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు అంటే ?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన వేలం డిసెంబర్ మాసం 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో జరిగే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 15వ తేదీ లోపు వదిలేసే ప్లేయర్ల లిస్టును తయారు చేయాలని ఇప్పటికే 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఏ ప్లేయర్లను అంటిపెట్టుకోవాలి? ఏ ప్లేయర్ ను వదిలివేయాలి ? అనే దాని పైన ఫ్రాంచైజీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం నలుగురు ప్లేయర్లను వదిలేసి ఎందుకు సిద్ధమైందట. ఈ లిస్టులో ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నట్లు తెలుస్తోంది. అతనితోపాటు జాక్‌ ప్రెజర్ , టి. నటరాజన్ అలాగే దశుమంతా చమీరా ( Dushmantha Chameera) కూడా ఉన్నాడని ఈ ప్రచారం జరుగుతోంది. అటు కేకేఆర్ జట్టులో రింకు సింగ్ తో పాటు రస్సెల్ పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2026 టోర్నమెంట్ కు  ( IPL 2026 Tournament ) సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపు ఖరారు అయింది. డిసెంబర్ లో మినీ వేలం జరిగితే మార్చి 15వ తేదీ 2026 నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అంటే వచ్చే సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament ) జరగనుంది అన్నమాట. దాదాపు ఈ టోర్నమెంటు లో 84 మ్యాచులు జరగనున్నాయి.

Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజ‌యం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మ‌న ర్యాంక్ ఎంతంటే

 

 

Related News

2021లో టీమిండియా ఓట‌మితోనే, పాకిస్తాన్ టీమ్ ప‌త‌నం మొద‌లైంది

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్‌…ఐసీసీ ప్లాన్ అదుర్స్‌

ఇప్పుడే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో ప్ర‌తీకారం తీర్చుకుంటాం

పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

పాకిస్తాన్ ఘోర ఓట‌మి…హుటా హుటిన‌ దుబాయ్ వెళ్లిన న‌ఖ్వీ..!

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

Advertisement
×