Delhi Crime season 3 on OTT : షెఫాలీ షా నటించిన థ్రిల్లర్ సిరీస్ ‘ఢిల్లీ క్రైమ్’ గురించి ఎట్టకేలకు కొత్త అప్‌డేట్ వచ్చింది, ఇది వరకే రెండు సీజన్ లతో అదరగొట్టిన ఈ సిరీస్, సీజన్ 3 డిసెంబర్లో విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబందించి ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇది ఐయండిబిలో కూడా టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘ఢిల్లీ క్రైమ్’ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 2019, 2022 సీజన్‌ల తర్వాత 3వ సీజన్ నవంబర్ లో స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది. రిచీ మెహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో షెఫాలి షా, రసికా దుగ్గల్, రాజేష్ తైలంగ్, హుమా కురేషీ సయానీ గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 డిసెంబర్ లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవ్వబోతోంది. ఐయండిబిలో 8.2 రేటింగ్ ని కూడా పొందింది.
వర్తిక చతుర్వేది అనే పోలీస్ అధికారి తన ఫ్యామిలీ సమస్యలు, పోలీసు జాబ్ ఒత్తిడి మధ్య స్ట్రగుల్ అవుతుంటుంది. అయినా కూడా ఆమె డిఫికల్ట్ కేసులను సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇక సీజన్ 3లో కొత్త కేస్ తో ముందుకు వస్తుంది. ఢిల్లీలో చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతుంటారు. వాళ్ళను అక్రమ రవాణా చేస్తూ, వ్యభిచారంలోకి దింపుతుంటారు. వర్తిక ఈ కేస్ తీసుకుంటుంది, ACP నీతి సింగ్ ఆమెకు సపోర్ట్ గా ఉంటుంది. హుమా కురేషీ అనే ఒక క్రూరమైన మహిళ, ఈ ట్రాఫికింగ్ రింగ్ నడుపుతుంటుంది. వర్తిక ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి సాయశక్తులూ ఒడ్డు తుంది.
Read Also : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా