E-Paper
Advertisement

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారు టికెట్ల రేట్లపై బిగ్ రిలీఫ్..

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారు టికెట్ల రేట్లపై బిగ్ రిలీఫ్..
Advertisement

MSVPG Film: ఇటీవల కాలంలో ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ వారు పెట్టిన పెట్టుబడి మొత్తం రాబడుతున్నారు. ఇలా సినిమా టికెట్ల రేట్లు పెరగడం వల్ల నిర్మాతలకు రావాల్సిన డబ్బులు వస్తాయి కానీ ప్రేక్షకులపై పెద్ద ఎత్తున భారం పడుతున్న సంగతి తెలిసిందే.. ఇలా టికెట్ల రేట్లు పెంచడం గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

టికెట్ ధరలు పెంచడం లేదు.

ఇక స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కచ్చితంగా ఆ సినిమా పెరిగిన టికెట్ ధరలతో వారం రోజులపాటు థియేటర్లలో రన్ అవుతుంది.. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలకు టికెట్ ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలకు సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా టికెట్ ధరలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిర్ణయం సరైనదేనా?

Advertisement

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు టికెట్ల రేట్ల విషయంలో ప్రేక్షకులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారని చెప్పాలి. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ధరలకే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడం లేదనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణ టికెట్ ధరలతో సినిమాని విడుదల చేయడం సరైన నిర్ణయమేనా? నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటారా? అనే సందేహాలను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతగా మెగా డాటర్..

Advertisement

ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదేల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా 12వ తేదీ విడుదల కాగా 11వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇక హీరోయిన్లుగా నయనతార నటించగా మరొక హీరోయిన్ కేథరిన్ సైతం ఈ సినిమాలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read: Sakhi Vidya: ఉస్తాద్ భగత్ సింగ్ రిజెక్ట్ చేసిన నటి సాక్షి… ఆ వార్తలకు చెక్ పెట్టిందిగా!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×